అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. పుష్ప2 సినిమాను కూడా లైన్లో పెట్టాడు. సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సీక్వెల్ పనిలో బన్నీ బిజీగా ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్.. మెగా ఫ్యాన్స్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. అల్లు అర్జున్‌పై మెగా అభిమానులు ట్రోల్ చేస్తుండగా.. ఇటు అల్లు అర్జున్ ఆర్మీ కూడా మెగా అభిమానులపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే మెగా అభిమానులు ఓ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయిం తీసుకున్నారు.
విజయవాడలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు అత్యవసర సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 13 జిల్లాలకు చెందిన మెగా అభిమానులు పాల్గొన్నారు. అయితే పరిమిత సంఖ్యలో కీలక వ్యక్తులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. జనసేన పార్టీకి మద్దుతుగా ఉండేలా తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యచరణపై సమావేశంలో చర్చించారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు అధ్యక్షతన నిర్వహించారు. అయితే ఇదే మీటింగ్‌లో కొందరు మెగా అభిమానులు అల్లు అర్జున్‌పై విమర్శలు చేశారు. ఆ వీడియో బయటకు రావడంతో.. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ట్విటర్లో ఇండియా వైడ్ ట్రిండింగ్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం పీకలేరు బ్రదర్ అనే హ్యష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.
మీటింగ్‌లో మెగా అభిమాని ఒకరు మాట్లాడుతూ.. అల్లు అర్జున్ గతంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు చెప్పిన చెప్పను బ్రదర్ అనే డైలాగ్‌ను రిపీట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఓ బ్రదర్ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను.. చెప్పను బ్రదర్.. మాట్లాడను బ్రదర్‌ని మనం ఎందుకు మోయాలి.. మనం ఇంతవరకు ఎందుకు మోయాలి.. అవసరం లేదు బ్రదర్.. చూడం బ్రదర్ మనస్ఫూర్తిగా చెబుతున్నా.. మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారు ఈ మాట విని హర్షిస్తారొ లేదో నాకు తెలియదు.. నది దాటాక తెప్ప తెగలేసే రకం వద్దు బ్రదర్.. ఇవాళ నువ్వు అనుభవిస్తున్న జీవితం.. కేవలం మెగాస్టార్ అన్నయ్య గురించే...వద్దు బ్రదర్.. దయచేసి అహం, అహంకారాలు వద్దు... ఎంతోమంది వచ్చారు ఎంతోమంది పోయారు.. రాబోయే నీ సినిమానే లాస్ట్ బ్రదర్.. మెగా అభిమానులతో పెట్టుకోవద్దు బ్రదర్ అంటూ.. అల్లు అర్జున్‌కు పరోక్షంగా మెగా అభిమానులు వార్నింగ్ ఇచ్చారు.
#Pushpa2 ne last movie anta👌cinema lu chestune untadu evadu aputhado chustam.
Venaka evaru anpistunaro kuda telsu
Me movies disaster ithe a frustration ma hero medha edvadam entra💦
Negativity ni thokadam ayanki alavatu
Ayana venta undadam maku alvatu.
FOREVER @alluarjun ✊👑 pic.twitter.com/x8StrEe4oj
— Allu Arjun TFC™ (@AlluArjunTFC) May 23, 2022
దీంతో ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మీలాగే చాలామంది చెప్పి వెళ్లారు.. మీరు అల్లు అర్జున్ బూట్లు తుడవడానికి కూడా పనికిరారు అంటూ ఓ ఫ్యాన్ పోస్టు చేశాడు. టాలెంట్ ఉన్నవాడినికి ఎవరూ ఆపలేరు.. ఏం పీకలేరు.. పుష్ప2తో జాతిని మింగుతాడు... అంటూ బన్నీ, ఎన్టీఆర్ ఫోటో పెట్టి మరో నెటిజన్ పోస్టు చేశాడు. మెగా మొగుడు అల్లు అర్జున్ అంటూ మరో నెటిజన్ అన్నాడు.మరొకరు ఆచార్య పోయిందని బాధతో ఇలా మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్‌కు మెగా ఫ్యాన్స్ మద్దతు లేకపోయిన అతడు ఆగడు మీరు ఏం పీకలేరు బానిస బ్రదర్స్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇలా అల్లు అర్జున్ అభిమానులు వందల కొద్ది పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై మెగా హీరోలు ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Chiranjeevi, Pawan kalyan