Allu Arjun Family | రీసెంట్గా టాలీవుడ్ సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. తన ముగ్గురు అబ్బాయిలైన అల్లు అర్జున్, శిరీష్ వెంకటేష్లతోకలిసి తన తండ్రి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్ధం ‘అల్లు’ స్టూడియోస్‌ను నిర్మించబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఐతే.. ఈ స్టూడియోను ఎక్కడ నిర్మిస్తున్నారు. ఎన్నిఎకరాల్లో నిర్మిస్తారనేది మాత్రం చెప్పలేదు. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ..అల్లు స్టూడియోస్ కోసం అల్లు అరవింద్.. హైదరాబాద్ శివారులోని గండిపేట ప్రాంతం దగ్గరలో 10 ఎకరాలను ఇప్పటికే కొనుగోలు చేసి పెట్టుకున్నారట. అక్కడే ఈ స్టూడియో నిర్మించే ప్లాన్ చేసినట్టు సమాచారం.

అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అల్లు ఫ్యామిలీ నివాళులు (Twitter/Photo)
అంతేకాదు దసరా నవరాత్రుల్లోనే ఈ స్టూడియోకు సంబంధించిన భూమి పూజా చేసి నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు అల్లు ఫ్యామిలీకి సంబంధించిన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు స్టూడియోలున్న వాటికీ ధీటుగా.. దాదాపు రూ. 100 కోట్ల భారీ నిర్మాణ వ్యయంలో ఈ స్టూడియోను నిర్మించాలనే ప్లాన్‌లో ఉన్నారట అల్లు కుటుంబం.

అన్నదమ్ములైన అల్లు శిరీష్, అల్లు వెంకటేష్‌లతో అల్లు అర్జున్ (Twitter/Photo)
ఈ ‘అల్లు’ స్టూడియోలనే ఇకపై ‘ఆహా’ ఓటీటీకి సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాలతో పాటు షూటింగ్స్‌ను ఇక్కడే నిర్వహించేలా ప్లాన్ చేసారట. మొత్తంగా అల్లు వారి ఫ్యామిలీ ఒకవైపు సినిమాల నిర్మాణం, మరోవైపు ఓటీటీలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వాటికీ ధీటుగా ఇపుడు స్టూడియో రంగంలోకి అడుగుపెట్టడం చూస్తుంటే.. అల్లు ఫ్యామిలీ మంచి ప్లానింగ్‌తోనే ఈ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు స్పష్టమవుతుంది. మరోవైపు అల్లు అరవింద్.. వేరే నిర్మాణ సంస్థలతో పలు చిత్రాలను నిర్మిస్తున్నడు. అల్లు అర్జున్.. త్వరలోనే ‘పుష్ప’ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతున్నాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:October 05, 2020, 07:30 IST