అయ్యో రామా అల్లు అర్జున్‌కు ఏంటీ కష్టాలు.. పాపం బన్నీ..

Allu Arjun: ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మొదట్లో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. అదే ఊపులో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 12, 2020, 7:09 PM IST
అయ్యో రామా అల్లు అర్జున్‌కు ఏంటీ కష్టాలు.. పాపం బన్నీ..
సుకుమార్, అల్లు అర్జున్ (Sukumar Allu Arjun)
  • Share this:
ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మొదట్లో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. అదే ఊపులో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు ఈయన. ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ కూడా అయిపోయాడు. బన్నీ లుక్ చూసి అంతా షాక్ అయ్యారు. మొన్నామధ్య ఆయన పుట్టిన రోజు కానుకగా విడుదల చేసాడు దర్శకుడు సుకుమార్. ఇక ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా ఆగిపోయింది. కరోనా కొలిక్కి వచ్చిన తర్వాతే షూటింగ్ మళ్లీ తిరిగి ప్రారంభం కానుంది.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Photo)
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Photo)


మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవి శ్రీ మ్యూజిక్ స్వరాలందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్‌కు లాక్‌డౌన్‌తో చెప్పుకోలేని కష్టాలు వచ్చాయి. ఈ సినిమాలో మాస్ లారీ డ్రైవర్ పాత్ర చేస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసే పాత్ర ఇది. పుష్పక్ నారాయణ్ పూర్తి పేరు. పూర్తిగా సీరియస్‌గా సాగే రివేంజ్ డ్రామాగా పుష్ప వస్తుందని తెలుస్తుంది. రంగస్థతం సినిమాను మించిన ఎమోషనల్ డ్రామా పుష్ప సినిమా.

అల్లు అర్జున్ (allu arjun)
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Photo)


ఈ చిత్రంలో చిత్తూరు కుర్రాడిగా నటిస్తున్న బన్నీ.. ఈ యాస కూడా నేర్చుకుంటున్నాడు. ఇక ఈ చిత్రం కోసం బాగానే మారిపోయిన బన్నీకి ఇప్పుడు ఆ పాత్ర కంటే ఎక్కువ గడ్డం, జుట్టు పెరిగిపోతుంది. పుష్ప కోసం చేసిన లుక్ కంటే కూడా బన్నీ లుక్ అవసరానికి మించిపోతుంది. దీంతో కాస్త తగ్గించే పనిలో బన్నీ ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు లుక్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అల్లు వారబ్బాయి. అందుకే బయటికి వచ్చి మరీ వాకింగ్ గట్రా చేస్తున్నాడు బన్నీ.
Published by: Praveen Kumar Vadla
First published: July 12, 2020, 7:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading