నా పేరు సూర్య తర్వాత కొన్ని రోజులు తెలియకుండానే ఆయన కెరీర్ నెమ్మదించింది. వరస సినిమాలు చేసే బన్నీ.. ఆర్నెళ్లకు పైగానే రెస్ట్ తీసుకున్నాడు. ఈ మధ్యే మళ్లీ త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టాడు ఈయన. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే నా పేరు సూర్య తర్వాత వచ్చిన బ్రేక్ భర్తీ చేయాలని చూస్తున్నాడు ఈ మెగా హీరో. వరస సినిమాలు ఒప్పుకోవడమే కాదు.. దాన్ని పూర్తి చేయడానికి కూడా పక్కా ప్లానింగ్ సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్
అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఎలాగూ సెట్స్‌పై ఉంది. ఇది డిసెంబర్‌లోపు షూటింగ్ పూర్తి చేసుకోనుంది. సంక్రాంతికి సినిమా విడుదల కానుందని అనౌన్స్ చేసాడు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ నుంచి సుకుమార్ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మహేష్ బాబుతో సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత బన్నీని ఎంచుకున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే ఆర్య, ఆర్య 2 ఈ కాంబినేషన్లో వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమాకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలు పెట్టి సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు బన్నీ.

అల్లు అర్జున్ సుకుమార్
వేసవి సెలవులను క్యాష్ చేసుకోవాలనేది ఈయన ప్లాన్. రంగస్ధలం అలాగే విడుదల చేసాడు సుకుమార్. ఇక ఈ చిత్రంతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా కూడా ఒప్పుకున్నాడు అల్లు అర్జున్. దిల్ రాజు నిర్మించబోయే ఈ చిత్రం వచ్చే ఏడాది పట్టాలెక్కనుందని తెలుస్తుంది. దీన్ని కూడా వేగంగా పూర్తి చేసి.. 2021 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు. ఇలా 2020 సంక్రాంతితో మొదలుపెట్టి.. 2020 సమ్మర్.. 2021 సంక్రాంతి సీజన్స్ వరకు తన స్లాట్స్ అన్నీ ఫుల్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. ఈ ప్లాన్ వినడానికి బాగానే ఉంది.. వర్కవుట్ అయితే అభిమానులకు పండగే మరి.
Published by:Praveen Kumar Vadla
First published:August 03, 2019, 13:58 IST