సినిమాలు చేయకపోయినా కూడా ఇప్పుడు అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది. ఈయన ఏం చేసినా కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాడు. తాజాగా రాజమండ్రి ఎయిర్ పోర్టులో రచ్చ చేసాడు బన్నీ. సొంతూరుకు సంక్రాంతి కోసం వెళ్తున్న బన్నీకి ఘనస్వాగతం పలికారు అభిమానులు. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ పిఆర్ టీం ఉన్న హీరో అల్లు అర్జున్. ఈయనకు ఉన్న పిఆర్ టీం అంత స్ట్రాంగ్ మరి. ఆయనేం చేసినా కూడా అది సంచలనంగా మారుతుంది. అంతగా వాళ్లు బన్నీని ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నా కూడా ఈయన ప్రేక్షకులకు మాత్రం చేరువగానే ఉన్నాడు.
ఇప్పుడు కూడా తన బంధువులు కొప్పినీడి వారి ఆహ్వానం మేరకు కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు బన్నీ. పాలకొల్లు దగ్గర్లో ఉన్న కాజా గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని అతిథి మర్యాదలు స్వీకరించారు అల్లు అర్జున్. అల్లు వారబ్బాయి రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆ తర్వాత గోదావరి నదిలో కుటుంబంతో కలసి బోట్లో ప్రయాణించాడు బన్నీ. 15వ తేదీన సంక్రాంతి పర్వదినం సందర్భంగా పంచారామాల్లో ఒకటైన శ్రీక్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం దర్శించుకోనున్నాడు అల్లు అర్జున్.
రోజూ ఏదో ఓ వార్తతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తూనే ఉంటాడు బన్నీ. అది ఆయన ప్రత్యేకత. ఆ మధ్య అల్లు అర్జున్ అభిమాని ఒకరు హిమాలయాలకు వెళ్లాడు.. అది సంచలనం అయిపోయింది. ఆ తర్వాత వరదల కారణంగా నష్టపోయిన గ్రామాలకు తనవంతుగా సాయం చేసాడు బన్నీ. దాన్ని కూడా బాగానే ప్రమోట్ చేసి బన్నీ ఇమేజ్ మరింత పెంచేసారు పిఆర్ టీం. ఈయన పర్సనల్ ఇమేజ్ పెరగడంలో పిఆర్ టీం అద్భుతంగా పని చేస్తుందని అర్థమైపోతుంది. తాజాగా మరో విషయంలో కూడా బన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాడు.
ఈ సంక్రాంతి పండక్కి సొంత ఊరు వెళ్లబోతున్నాడు బన్నీ. దాన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు అభిమానులు. బన్నీకి అక్కడ ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. దాంతో అల్లు అర్జున్ ఇప్పుడేం చేసినా కూడా సంచలనం అవుతుంది. ఇప్పుడు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు అందుకే వచ్చాడు బన్నీ. ఆయన వచ్చిన దగ్గర్నుంచి బైక్ ర్యాలీలు చేసి మరీ దారిపొడువునా బన్నీకి స్వాగతం పలుకుతూనే ఉన్నారు అభిమానులు. మొత్తానికి నా పేరు సూర్యతో కాస్త డీలా పడిన బన్నీ.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ లో కింగ్ అనిపించుకుంటున్నాడు. ఫిబ్రవరి నుంచి ఈయన త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నాడు.
అమీషా పటేల్ హాట్ ఫోటోషూట్..
ఇవి కూడా చదవండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Social Media, Telugu Cinema, Tollywood