నువ్వేరా నా ప్రేమ.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్..

Allu Ayaan Birthday: అల్లు అర్జున్‌కు కుటుంబం అంటే ప్రాణం.. ఏ మాత్రం ఫ్రీ టైమ్ దొరికినా కూడా వెంటనే పిల్లలతో వాలిపోతాడు. అలాంటిదిప్పుడు ఏకంగా లాక్ డౌన్ కావడంతో ఇంట్లోనే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 3, 2020, 9:02 PM IST
నువ్వేరా నా ప్రేమ.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్..
అల్లు అయాన్ బర్త్ డే వేడుకలు (allu arjun allu ayaan birthday)
  • Share this:
అల్లు అర్జున్‌కు కుటుంబం అంటే ప్రాణం.. ఏ మాత్రం ఫ్రీ టైమ్ దొరికినా కూడా వెంటనే పిల్లలతో వాలిపోతాడు. అలాంటిదిప్పుడు ఏకంగా లాక్ డౌన్ కావడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఇన్ని రోజులు మిస్ అయిన టైమ్ అంతా ఇప్పుడు వాళ్లతోనే గడిపేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఎప్రిల్ 3న అల్లు అర్జున్ తనయుడు అయాన్ పుట్టిన రోజు. ఈ బుడ్డోడు పుట్టి అప్పుడే ఆరేళ్లు గడిచిపోయాయి. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమకు చిహ్నంగా 2014లో పుట్టాడు అయాన్. కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయని ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు బన్నీ. ఇక ఇప్పుడు తనయుడి పుట్టిన రోజుకు ఎమోషనల్ ట్వీట్ చేసాడు బన్నీ.

నా జీవితంలో ప్రేమ అంటే ఏంటని చాలా సార్లు ఆలోచించాను.. కానీ ఒక్కసారి కూడా అసలైన ప్రేమ అంటే ఏంటో తెలియలేదు. కొన్నిసార్లు అర్థమైనా కూడా అదే నిజమైన ప్రేమ అనిపించలేదు.. ఎప్పుడైతే నువ్వు నా జీవితంలోకి వచ్చావో.. నువ్వు పుట్టావో అప్పుడే తెలిసింది నిజమైన ప్రేమ అంటే ఏంటో..? నువ్వేరా నా ప్రేమ.. నా జీవితం అంటూ కొడుకు అయాన్‌కు ఎమోషనల్ బర్త్ డే విషెస్ తెలిపాడు బన్నీ. దాంతోపాటు కుటుంబమంతా కలిసి తనయుడి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: April 3, 2020, 9:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading