Allu Arha : సమంత ‘శాకుంతలం’ షూటింగ్‌లో జాయిన్‌ అయిన అల్లు అర్జున్ కూతురు అర్హ..

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ (Twitter/Photo)

Allu Arha : సమంత ‘శాకుంతలం’ షూటింగ్‌లో జాయిన్ అల్లు అర్జున్ కూతురు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు.

  • Share this:
    Allu Arha : సమంత ‘శాకుంతలం’ షూటింగ్‌లో జాయిన్ అల్లు అర్జున్ కూతురు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం సమంత అక్కినేని టైటిల్‌ రోల్లో ‘శాకుంతలం’ అనే పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తోంది. అల్లు అర్హ ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే 10 రోజుల షూటింగ్‌లోపాల్గొన్న  అల్లు అర్హ.. తాజాగా ఈ సినిమా షూటింగ్ తిరిగి జాయిన్ అయింది. దానికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

    శాకుంతలం  సినిమాను మహాభారత గాథలోని ఆదిపర్వంలో ఉన్న అద్భుతమైన, అందమైన ప్రేమ కథ ఆధారంగా రూపోందుతుంది. ఇందులో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు. కేరళలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు దేవ్ మోహన్. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


    గుణ శేఖర్ శాకుంతలం కంటే ముందు రానాతో హిరణ్య కశ్యప అనే ఓ భారీ సినిమాను ప్రకటించారు. ఆయన ఎప్పటినుండో ఈ సినిమాను తెరకెక్కించాలనీ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా రానా ప్రధాన పాత్రలో ఈ సినిమాను ప్రకటించారు కూడా. పురాణాలలో శివ భక్తుడు రాక్షస రాజు హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు మధ్య జరిగే సన్నివేశాలతో గుణ శేఖర్ ఈ కథను అల్లుకున్నారు గుణ శేఖర్. ఇప్పటికే తొలి టాకీ ‘భక్త ప్రహ్లాదతో పాటు ఎస్వీఆర్ ప్రధాన పాత్రలో ‘భక్త ప్రహ్లాద’గా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు మరోసారి ఆ కథతో గుణశేఖర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో గుణ శేఖర్ సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే సినిమాను మొదలు పెట్టారు. గతంలో ‘శాకుంతలం’ కథతో ఎన్టీఆర్, బి. సరోజా దేవి ప్రధాన పాత్రల్లో ‘శకుంతల’ సినిమా తెరకెక్కింది. ఆ తర్వాత ఎన్టీఆర్, బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో శకుంతల ఉపకథ ఉంటుంది. మొత్తంగా తెలుగు తెరపై రెండు సార్లు కనిపించిన ఈ కథతో గుణశేఖర్ ఈ  సినిమాను ఏ మేరకు మెప్పిస్తారనేది చూడాలి.

    allu arha, samantha
    సమంత కొడుకు పాత్రలో అల్లు అర్హ allu arha, samantha


    ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తోంది సమంత. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కవాతుల రెండు కాదల్ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. ఇక సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో  కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే
    Published by:Kiran Kumar Thanjavur
    First published: