అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డ్.. రాములో రాములా 100 మిలియన్..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ చిత్రంలోని పాటలు కూడా ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 18, 2019, 8:44 PM IST
అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డ్.. రాములో రాములా 100 మిలియన్..
రాములో రాములా పాటకు 100 మిలియన్స్
  • Share this:
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ చిత్రంలోని పాటలు కూడా ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పటికే సామజవరగమనా పాట యూ ట్యూబ్‌లో సరికొత్త రికార్డులకు తెరతీసింది. ఇప్పుడు రాములో రాములా కూడా ఇదే చేసింది. ఈ పాట కూడా సంచలన రికార్డులు సృష్టిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. దానికి ముందే టీజర్, పాటలతో సినిమా రేంజ్ మారిపోయింది. బిజినెస్ కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ప్రమోషన్స్‌లో కూడా జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు.


ఈ సినిమాలోని రెండో పాట రాములో రాములా ఇప్పుడు 100 మిలియన్ మార్క్ అందుకుని ఔరా అనిపిస్తుంది. దివాళికి విడుదలైన ఈ పాటకు తొలిరోజే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాసాడు. పక్కా తెలంగాణ బీట్‌లో సాగే ఈ పాటకు థమన్ కూడా అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడు. కాపీ అనే ముద్ర వేసుకున్నా కూడా పాట మాత్రం రప్ఫాడించింది. ఇప్పుడు ఏకంగా 100 మిలియన్ మార్క్ అందుకోవడంతో పండగ చేసుకుంటున్నారు మేకర్స్. సామజవరగమనా సాంగ్ కూడా ఇప్పటికే 100 మిలియన్ మార్క్ అందుకుంది. ఇలా ఒకే సినిమా నుంచి రెండు పాటలు ఇలా రేర్ రికార్డు అందుకోవడం ఇదే తొలిసారి.
First published: December 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading