కేరళలో అల్లు అర్జున్ రచ్చ మాములుగా లేదుగా..

అల్లు అర్జున్, త్రివ్రిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. రిలీజైన రోజు నుంచే నుంచే  బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. తాజాగా ఈ సినిమా కేరళలో రచ్చ చేస్తోంది.

news18-telugu
Updated: January 17, 2020, 12:00 PM IST
కేరళలో అల్లు అర్జున్ రచ్చ మాములుగా లేదుగా..
కేరళో అల్లు అర్జున్ రచ్చ (Twitter/Photo)
  • Share this:
అల్లు అర్జున్, త్రివ్రిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. రిలీజైన రోజు నుంచే నుంచే  బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. ఫస్ట్ డే వాల్డ్ వైడ్‌గా ’అల వైకుంఠపురములో’  దాదాపు రూ. 45 కోట్ల గ్రాస్ రూ. 35 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఐదో రోజైన కనుమన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 11 కోట్ల వరకు షేర్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.64 కోట్లు.. ఓవర్సీస్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా అన్ని కలిపితే ప్రపంచ వ్యాప్తంగా.. రూ. 83 కోట్ల వరకు షేర్...రూ. 125 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. ఓవర్సీస్‌లో ఈ సినిమాను సరిలేరు నీకెవ్వరు సినిమా కలెక్షన్లను క్రాస్ చేయడం విశేషం. ‘అల వైకుంఠపురములో’ సినిమా. ఇక ఈ చిత్రం మలయాళంలో  ‘అంగు వైకుంఠపురత్తు’ పేరుతో రిలీజై అక్కడ కూడా సంచలనాలు సృష్టిస్తోంది.

కేరళలో అల్లు అర్జున్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు అక్కడ ఐదో రోజు ఈ సినిమాకు స్క్రీన్స్ పెరగడం విశేషం. మలయాళంలో కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లనే సాధించింది. లెక్కలు వెల్లడికాపోయినా..అన్ని చోట్ల హౌస్‌పుల్‌ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఇక  తాజాగా కేరళకు చెందిన అల్లు అర్జున్‌ ఫ్యాన్ మరక్కడ్‌లో ‘అల వైకుంఠపురములో’ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. సంక్రాంతి రిలీజైన సినిమాల్లో ఓవర్సీస్‌లో ఎక్కువ వసూళ్లతో ‘అల వైకుంఠపురములో’ సినిమా ముందు వరసలో ఉంది.
First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు