హోమ్ /వార్తలు /సినిమా /

నితిన్‌, రష్మిక సహా భీష్మ టీమ్‌కు అల్లు అర్జున్ స్పెషల్ కంగ్రాట్స్..

నితిన్‌, రష్మిక సహా భీష్మ టీమ్‌కు అల్లు అర్జున్ స్పెషల్ కంగ్రాట్స్..

నితిన్, రష్మికలకు అల్లు అర్జున్ స్పెషల్ కంగ్రాట్స్ (Twitter/Photo)

నితిన్, రష్మికలకు అల్లు అర్జున్ స్పెషల్ కంగ్రాట్స్ (Twitter/Photo)

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు అల్లు వారబ్బాయి అల్లు వారబ్బాయి స్పెషల్ కంగ్రాట్స్ తెలిపాడు. అది కూడా డబుల్ కంగ్రాట్స్ చెప్పడం విశేషం. నితిన్‌తో పాటు హీరోయిన్ రష్మికతో పాటు భీష్మ టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించాడు.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు అల్లు వారబ్బాయి అల్లు వారబ్బాయి స్పెషల్ కంగ్రాట్స్ తెలిపాడు. అది కూడా డబుల్ కంగ్రాట్స్ చెప్పడం విశేషం. వివరాల్లోకి వెళితే.. దాదాపు యేడాదిన్నర గ్యాప్ తర్వాత నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసిన ‘భీష్మ’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. దాంతో పాటు ఈ యేడాదే నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ..‘భీష్మ’ సినిమా సక్సెస్‌తో పాటు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నితిన్‌కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసాడు. ‘భీష్మ’ సక్సెస్‌తో నితిన్ సరైన సమయంలో సరైన విజయం అందుకున్నాడని అల్లు అర్జున్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ సినిమా సక్సెస్‌తో నీ వివాహా వేడుకలు మరింత సందడిగా మారనున్నాయన్నాడు. నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగా ఉందన్నారు. అంతేకాదు ‘భీష్మ’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక‌తో పాటు ఈ సినిమాను డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల,చిత్ర  నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసాడు అల్లు అర్జున్. మీ టీమ్ మొత్తం కలిసి మంచి విజయం అందుకున్నారన్నారంటూ  అభినందలతో ముంచెత్తాడు. మరోవైపు రష్మిక.. అల్లు అర్జున్‌కు థాంక్స్ చెప్పింది.

అల్లు అర్జున్ విషయానికొస్తే.. ఈ యేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మంచి  సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేయనున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే టైటల్ అనుకుంటున్నారు. త్వరలోనే కేరళలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

First published:

Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Bheeshma, Nithiin, Rashmika mandanna, Sukumar, Telugu Cinema, Tollywood, Venky Kudumula

ఉత్తమ కథలు