గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిపై జరుగుతున్న ఊహా గానాలకు అల్లు అర్జున్ చెక్ పెట్టాడు.
గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిపై జరుగుతున్న ఊహా గానాలకు అల్లు అర్జున్ చెక్ పెట్టాడు. సంక్రాంతి రేసులో విడుదల కానున్న ఈ సినిమాను ముందుగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సంక్రాంతి రేసులో విడుదల కానున్న ఈ చిత్రాల దర్శక,నిర్మాతలు,హీరోలు ఒక అండర్ స్టాండింగ్ వచ్చిన తర్వాత విడుదల తేదిని ప్రకటించాలని ముందుగా అనుకున్నారు. కానీ ‘అల వైకుంఠపురములో’ టీమ్ మాత్రం సడెన్‌గా రిలీజ్ డేట్ ప్రకటించడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్.. హడావుడిగా జనవరి 12నే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సాధారణంగా సినిమాలన్ని శుక్రవారమే రిలీజ్ అవుతుంటాయి. అందుకు భిన్నంగా వీళ్లిద్దరు సండే రిలీజ్ డేట్ కోసం పోటీ పడ్డారు. ఇద్దరు ఒకే రోజు వస్తే.. కలెక్షన్లు షేర్ చేసుకోవాల్సి రావడం వంటి సమస్యలు వుండటంతో ఇద్దరు నిర్మాతలు ఒక అండర్ స్టాండింగ్‌తో ఒకరోజు గ్యాప్‌లో తమ సినిమాలు విడుదల చేసుకున్నారు.
Alavaikunthapurramuloo releasing on this JAN 12th 2020 . A warm family entertainer with beautiful musicals . Waiting to touch your hearts soon ... #alavaikunthapurramuloopic.twitter.com/4CuztZHBbx
కానీ ఒకరోజు ముందుగా జనవరి 11న రిలీజ్ కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి కలెక్షన్ల పరంగా థియేటర్స్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉండటంతో.. ‘అల వైకుంఠపురములో’ టీమ్ తమ సినిమాను జనవరి 10న విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఇదే జరిగితే..‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని కూడా జనవరి 10నే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తాజాగా ‘అల వైకుంఠపురములో’ చిత్ర విడుదల విషయమై అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేసాడు. ఈ సినిమాను జనవరి 12న థియేటర్స్‌లో రిలీజ్ అవుతుందని ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేయడంతో ఇప్పటి వరకు జరిగిన కన్ఫ్యూజన్కు తెరదించినట్టైయింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.