• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ALLU ARJUN COMPLETES 16 YEARS AS A HERO IN TOLLYWOOD FILM INDUSTRY TA

టాలీవుడ్ రేసుగుర్రం అల్లు అర్జున్ @16 ఇయర్స్ ఇండస్ట్రీ..

టాలీవుడ్ రేసుగుర్రం అల్లు అర్జున్ @16 ఇయర్స్ ఇండస్ట్రీ..

16 ఇయర్స్ జర్నీ

చేసినవి కొన్ని చిత్రాలైనా  తనదైన నటన డాన్స్, ఫైట్స్ .. లతో టాలీవుడ్లో నయా ట్రెండ్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్.టా లీవుడ్ లోనే కాకుండా మాలీవుడ్ లో తనదైన స్టైలిష్ నటనతో అభిమానులను సంపాదించుకొన్న దేశముదురు అల్లు అర్జున్.తాజాగా అల్లు వారి నట వారసుడు హీరోగా నేటితో 16 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాడు.

  • Share this:
    చేసినవి కొన్ని చిత్రాలైనా  తనదైన నటన డాన్స్, ఫైట్స్ .. లతో టాలీవుడ్లో నయా ట్రెండ్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్.టా లీవుడ్ లోనే కాకుండా మాలీవుడ్ లో తనదైన స్టైలిష్ నటనతో అభిమానులను సంపాదించుకొన్న దేశముదురు.  తెలుగులో తన సిక్స్ ప్యాక్ తో యూత్ ని అలరించిన స్టైలిష్ స్టార్. అతడే అల్లు నటవారసుడు అల్లు అర్జున్. ఈ నట వారుసుడు హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి నేటితో పదహారేళ్లు అవుతోంది. ఆయన హీరోగా నటించిన తొలి సినిమా ‘గంగోత్రి’ పదహారేళ్ల క్రితం ఇదే విడుదలైంది. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి టాలెంట్ ను పెట్టుబడిగా పెట్టి పైకి వచ్చిన హీరో అల్లు అర్జున్. తండ్రి టాలీవుడ్‌ను శాసిస్తున్న టాప్ ప్రొడ్యూసర్. మామ చిరు మెగాస్టార్ గా ప్రేక్షక నీరాజనాలందుకుని రాజకీయల్లో సైతం చక్రం తిప్పుతున్నాడు. తాత అల్లు రామలింగయ్య గురించైతే చెప్పక్కర్లేదు. తనదైన హాస్యంతో తెలుగు తెరను  ‘అల్లు’కుపోయిన గొప్ప నటుడు. ఇంత పెద్ద సపోర్టు ఉన్నా.. దాన్ని ఎంట్రీ వరకే వాడుకుని తాను పోషించే పాత్రలకు వందకు వంద శాతం న్యాయం చేస్తూ వస్తున్నాడు.

    Allu Arjun Completes 16 Years as a Hero In Tollywood Film Industry
    అల్లు అర్జున్@16 ఇయర్స్


    హీరోగా తొలి సినిమా ‘గంగోత్రి’ నుంచి ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ చేసే ప్రతి చిత్రంలో వైవిధ్యాన్ని ఆవిష్కరించాడు. ప్రస్తుతం అల్లు వారి వారసుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక  సినిమా చేస్తున్నాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో సినిమా. ఈ సినిమాకు ‘నేను..నాన్న’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ మూవీ ‘ది ఇన్‌వెన్షన్ ఆప్ లైయింగ్’ అనే హాలీవుడ్ సినిమాకు రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ పతాకంపై చినబాబు, అల్లు అరవింద్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ ‌పైకి వెళ్లనుంది.
    First published: