అల్లు అర్జున్ కెరీర్‌‌కు 17 ఏళ్ళు.. నువ్వేం హీరో అనే దగ్గర్నుంచి..

అల్లు అర్జున్ కెరీర్‌కు 17 ఏళ్లు పూర్తి (allu arjun 17 years career)

Allu Arjun: స‌రిగ్గా 17 ఏళ్ల కింద ఓ హీరో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. ఆయ‌న వ‌చ్చిన‌పుడు ఎవ‌రీ కుర్రాడు ఇలా ఉన్నాడు..? బ‌్యాగ్రౌండ్ ఉంటే ఎలా ఉన్నా హీరో అయిపోవ‌చ్చా..?

  • Share this:
స‌రిగ్గా 17 ఏళ్ల కింద ఓ హీరో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. ఆయ‌న వ‌చ్చిన‌పుడు ఎవ‌రీ కుర్రాడు ఇలా ఉన్నాడు..? బ్యాగ్రౌండ్ ఉంటే ఎలా ఉన్నా హీరో అయిపోవ‌చ్చా..? ప్రేక్ష‌కుల ముందుకు తోసేసి.. వాళ్లపైకి రుద్దేస్తారా.. అంటూ చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. బ‌హుశా తెలుగులో ఏ వార‌సుడిపై కూడా ఈ స్థాయి విమ‌ర్శ‌లు రాలేదు. కానీ అల్లు అర్జున్‌పై వ‌చ్చాయి. గంగోత్రి విడుద‌లైన‌పుడు చాలా మంది తిట్టారు కూడా. కానీ అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు ఆ హీరోను చూసి వావ్ అంటున్నాయి. అత‌డే అల్లు అర్జున్.. వ‌న్ అండ్ ఓన్లీ స్టైలిష్ స్టార్ ఆఫ్ తెలుగు ఇండ‌స్ట్రీ.

ఈయ‌న తొలి సినిమా గంగోత్రి విడుద‌లై 2020 మార్చ్ 28కి స‌రిగ్గా 17 ఏళ్లైంది. 2003.. మార్చ్ 28న విడుద‌లైంది ఆ సినిమా. ద‌ర్శ‌కేంద్రుడి చేతుల మీదుగా అశ్వినీద‌త్ ఆశీస్సుల‌తో వ‌చ్చాడు అల్లు అర్జున్. ఈ చిత్రం హిట్టైనా కూడా పెద్ద‌గా గుర్తింపు అయితే రాలేదు. కానీ 2004లో వ‌చ్చిన ఆర్య‌తో స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. సుకుమార్ తొలి సినిమా ఇది. ఆర్య‌తో బాగా మేకోవ‌ర్ అయ్యాడు అల్లు అర్జున్. ఆర్య సినిమా త‌ర్వాత విమ‌ర్శించిన వాళ్లే అబ్బో కుర్రాడిలో క‌సి ఉందిరా అంటూ పొగిడారు.

అల్లు అర్జున్ కెరీర్‌కు 17 ఏళ్లు పూర్తి (allu arjun 17 years career)
అల్లు అర్జున్ కెరీర్‌కు 17 ఏళ్లు పూర్తి (allu arjun 17 years career)


టాలీవుడ్ బెస్ట్ డాన్స‌ర్ గా అప్ప‌ట్లోనే చిరంజీవితో ప్ర‌శంస‌లు అందుకున్నాడు బ‌న్నీ. ఇక మూడో సినిమా బ‌న్నీతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు అల్లు అర్జున్. తొలి మూడు సినిమాల‌తో వ‌ర‌స హిట్లు అందుకున్న అతికొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒక‌రు. వెంట‌నే హ్యాపీ నిరాశ‌ ప‌రిచినా.. దేశ‌ముదురుతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరోగా చ‌రిత్ర సృష్టించాడు బ‌న్నీ. ఆ మ‌రుస‌టి ఏడాది ప‌రుగుతో త‌న న‌ట‌న‌ను చూపించాడు. ఆర్య 2.. వ‌రుడు.. వేదం.. బ‌ద్రీనాథ్ లాంటి సినిమాలు బ‌న్నీ ఇమేజ్‌ను దెబ్బ తీసాయి.

అల్లు అర్జున్ కెరీర్‌కు 17 ఏళ్లు పూర్తి (allu arjun 17 years career)
అల్లు అర్జున్ కెరీర్‌కు 17 ఏళ్లు పూర్తి (allu arjun 17 years career)


2012లో జులాయి సినిమాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో తొలిసారి 40 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టాడు. జులాయి త‌ర్వాత కూడా మ‌ళ్లీ ఫ్లాపులు అందుకున్న బ‌న్నీ.. 2014 నుంచి స్టైల్ మార్చుకున్నాడు. రేసుగుర్రం నుంచి బ‌న్నీకి గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయిపోయింది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి యావ‌రేజ్ టాక్‌తోనే 50 కోట్లు వ‌సూలు చేసింది. ఇక రుద్ర‌మ‌దేవికి బ‌న్నీనే ప్రాణం అయ్యాడు. స‌రైనోడు ఈ హీరో మాస్ ప‌వ‌ర్ ఏంటో చూపించింది. డిజే కూడా నెగిటివ్ టాక్‌తో ఓపెన్ అయి కూడా 70 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది.

అల్లు అర్జున్ కెరీర్‌కు 17 ఏళ్లు పూర్తి (allu arjun 17 years career)
అల్లు అర్జున్ కెరీర్‌కు 17 ఏళ్లు పూర్తి (allu arjun 17 years career)


2018లో వచ్చిన నా పేరు సూర్య ఫ్లాప్ అయినా కూడా ఈ ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో సంచలనం సృష్టించాడు. సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ 17 ఏళ్ల ప్ర‌యాణంలో తెలుగు వాళ్ళ‌తో పాటు మ‌ళ‌యాలీ ప్రేక్ష‌కుల మ‌న‌సు కూడా దోచుకున్నాడు అల్లు అర్జున్. అక్క‌డి వాళ్ల‌తో మ‌ల్లు అర్జున్ అని పిలిపించుకున్నాడు బ‌న్నీ. మొత్తానికి నువ్వేం హీరోవురా బాబూ అన్న నోళ్ళతోనే హీరో అంటే నువ్వేరా బాబూ అనిపించుకున్నాడు అల్లు అర్జున్.
Published by:Praveen Kumar Vadla
First published: