జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "18 పేజిస్" (18 Pages). ఈ సినిమాలో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. బన్నీ వాసు (Bunny Vasu) నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసంబర్ 23న రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ.. ''అందరికి నమస్కారం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. నా కుమారి 21ఎఫ్ సినిమాను వచ్చి బ్లెస్ చేసారు. ఇప్పుడు మా 18 పేజెస్ సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చిన ఐకాన్ స్టార్ కి థాంక్యూ సర్. ఇక్కడ లేని నా ఫ్యామిలీకి కృతజ్ఞతలు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి సుకుమార్ అన్నయ్య కారణం. సుకుమార్ గారు ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాదు మా టీం అందరికి సంబంధించిన వ్యక్తి. అన్నయ్య నాకు అవకాశం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అన్నయ్య మన టీం అందరి తరుపునుంచి థాంక్యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, అలానే బన్ని వాసు అన్నయ్య కి థాంక్యూ. నేను ఈ సినిమా నేను చాలా ఈజీ గా చేసేసా దానికి కారణం బన్నీవాసు అన్న'' అని అన్నారు.
నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. ''అందరికి నమస్కారం. ఈ సభాముఖంగా మా "జీఎఫ్ డి" టీం అందరికి కృతజ్ఞతలు. ప్రతి సినిమా నాకు 5% నేర్పిస్తే ఈ సినిమా 25% నేర్పించింది. నిఖిల్ గారు చాలా థాంక్యూ ఎప్పుడు షూటింగ్ అన్న వచ్చేసేవారు, అలానే అనుపమ గారు కూడా. సుక్కు నా లైఫ్ లోకి ఎప్పుడు వచ్చిన మంచిగా డబ్బులు వస్తాయి. నాకు ఇద్దరు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. నా లైఫ్ లో బన్ని 100% అయితే సుకుమార్ గారు 75% దిల్ రాజు గారు 25% ఇవన్నీ కలిపితే మా అరవింద్ గారు. గోపి సుందర్ తన మ్యూజిక్ తో మేజిక్ చేస్తాడు. బన్ని గారు గురించి ఏమి మాట్లాడిన తక్కువే అవుతుంది ఆయన లేకుండా నా ఫంక్షన్ జరగదు. థాంక్యూ సో మచ్'' అన్నారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ''నాకు ఇది సర్రియల్ మూమెంట్, నాకు ఆర్య సినిమా చాలా ఇష్టం. సో ఇక్కడ సుకుమార్, బన్నీ ఆర్య లో ఒక పార్ట్ అయినా సూర్యప్రతాప్ గారిది ఇక్కడ కూర్చోవడం నేను ఊహించలేదు. సుకుమార్ గారు నందిని కేరక్టర్ ను నాకు రాసినందుకు థాంక్యూ. ఈ సినిమా డిసెంబర్ 23 న రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి థాంక్యూ. బన్ని నువ్వు రావడం సహజం నేను థాంక్స్ చెప్పడం అంత బాగోదు'' అన్నారు.
మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్న మీడియాకి , మీమర్స్ చాలా థాంక్యూ. ఈ సినిమాను ఓటిటి లో అప్పుడే రిలీజ్ చెయ్యము. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. సుకుమార్ గారు ఒక గొప్ప ఆలోచన మీకు వచ్చి ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లో తియ్యాలి అని మీకు అనిపించి మా బన్నివాసు తో ఈ సినిమా తీసినందుకు సభాముఖంగా కృతజ్ఞతలు చెబుతున్నాను'' అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.