నాన్న నాన్నే... డబ్బులు డబ్బులే... అల్లు అర్జున్ అసక్తికర వ్యాఖ్యలు

అల వైకుంఠపురములో సినిమాకు తాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాననే అంశంపై అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

news18-telugu
Updated: February 13, 2020, 6:14 PM IST
నాన్న నాన్నే... డబ్బులు డబ్బులే... అల్లు అర్జున్ అసక్తికర వ్యాఖ్యలు
అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)
  • Share this:
అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమా... టాలీవుడ్‌లోనూ అనేక రికార్డులను సొంతం చేసుకుంది. కలెక్షన్లపరంగా నాన్ బాహుబలి రికార్డులను ఈ మూవీ సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా...మరికొద్ది రోజులు కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని సినీవర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు తాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాననే అంశంపై అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ సినిమా నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు కావడంతో... బన్నీ రెమ్యూనరేషన్ అంతా అల్లు అరవింద్ ఖాతాలోకే వెళుతుందని చాలామంది భావించారు.

కానీ... అలాంటిదేమీ లేదని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు స్టయిలిష్ స్టార్. రెమ్యూనరేషన్ విషయంలో అలాంటి మొహమాటాలేవీ ఉండవని చెప్పాడు. ఈ సినిమా విషయంలో తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ మొత్తం వచ్చిందని అన్నాడు. అయితే తన తండ్రి అల్లు అరవింద్‌తో రెమ్యునరేషన్ గురించి డైరెక్ట్‌గా మాట్లాడబోనని... ఈ విషయంలో తమ మధ్య ఓ మీడియేటర్ ఉన్నాడని వివరించాడు. తన స్నేహితుడు, నిర్మాత అయిన బన్నీ వాసు తన రెమ్యూనరేషన్ విషయంలో కఠినంగా ఉంటాడని... ఈ విషయంలో తన తండ్రితో కూడా ఆయన బేరాలు ఆడతాడని అన్నాడు.

First published: February 13, 2020, 6:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading