అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమా... టాలీవుడ్‌లోనూ అనేక రికార్డులను సొంతం చేసుకుంది. కలెక్షన్లపరంగా నాన్ బాహుబలి రికార్డులను ఈ మూవీ సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా...మరికొద్ది రోజులు కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని సినీవర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు తాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాననే అంశంపై అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ సినిమా నిర్మాతల్లో అల్లు అరవింద్ కూడా ఒకరు కావడంతో... బన్నీ రెమ్యూనరేషన్ అంతా అల్లు అరవింద్ ఖాతాలోకే వెళుతుందని చాలామంది భావించారు.
కానీ... అలాంటిదేమీ లేదని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు స్టయిలిష్ స్టార్. రెమ్యూనరేషన్ విషయంలో అలాంటి మొహమాటాలేవీ ఉండవని చెప్పాడు. ఈ సినిమా విషయంలో తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ మొత్తం వచ్చిందని అన్నాడు. అయితే తన తండ్రి అల్లు అరవింద్‌తో రెమ్యునరేషన్ గురించి డైరెక్ట్‌గా మాట్లాడబోనని... ఈ విషయంలో తమ మధ్య ఓ మీడియేటర్ ఉన్నాడని వివరించాడు. తన స్నేహితుడు, నిర్మాత అయిన బన్నీ వాసు తన రెమ్యూనరేషన్ విషయంలో కఠినంగా ఉంటాడని... ఈ విషయంలో తన తండ్రితో కూడా ఆయన బేరాలు ఆడతాడని అన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.