సైరా నరసింహారెడ్డి గెటప్‌లో అల్లు అర్జున్ తనయుడు అయాన్..

ఈ రోజు దేశ ప్రజలు 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సామాన్యుల నుంచి మాన్యలు వరకు అందరు ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ పిల్లలు స్వాతంత్య్ర సమరయోధుల గెటప్‌లో అదరగొట్టారు.

news18-telugu
Updated: August 15, 2020, 1:54 PM IST
సైరా నరసింహారెడ్డి గెటప్‌లో అల్లు అర్జున్ తనయుడు అయాన్..
సైరా అంటున్న అయాన్, మదన్ మోహన్ మాలవ్యగా అర్హ. (Instagram/Photo)
  • Share this:
ఈ రోజు దేశ ప్రజలు 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సామాన్యుల నుంచి మాన్యలు వరకు అందరు ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేళ అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ స్వాతంత్య్ర సమరయోధుల గెటప్‌లో కనిపించి అలరించారు. అల్లు అర్హ.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవ్య గెటప్‌లో అలరించింది. మరోవైపు అల్లు అయాన్ ఏమైనా తక్కువ తిన్నాడా.. ఏకంగా తాత చిరంజీవి వేసిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గెటప్‌లో అలరించాడు. వీళ్లిద్దరు వేసుకున్న ఈ గెటప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram

#syeraanarasimhareddy Thanks @sushmitakonidela ❤️❤️


A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

View this post on Instagram

Happy Independence Day #madanmohanmalaviya


A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

ఇక అల్లు అర్హ .. మదన్ మోహన్ మాలవ్య గెటప్‌లో కనిపించి సత్యమేవ జయతే అంటూ నినాదం చేసింది. గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ తన కూతురుకు సంబంధించిన వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. ఆ మధ్య అర్హ.. అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో సాంగ్‌ను దోష స్టెప్ అంటూ చెప్పిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 15, 2020, 1:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading