సంక్రాంతి పండగను అల్లు అర్జున్ చాలా వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడే..

ఎన్నడు లేనట్టుగా ఈ సంక్రాంతి పండగ అల్లు అర్జున్ కు డబుల్ హ్యపీ తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఈ సంక్రాంతిని బన్ని తన భార్యతో ఎలా సెలబ్రేట్ చేసకున్నాడో చూడండి.

news18-telugu
Updated: January 16, 2020, 9:45 AM IST
సంక్రాంతి పండగను అల్లు అర్జున్ చాలా వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడే..
‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ (Twitter/Photos)
  • Share this:
ఎన్నడు లేనట్టుగా ఈ సంక్రాంతి పండగ అల్లు అర్జున్ కు డబుల్ హ్యపీ తీసుకొచ్చింది. ‘దేశ ముదురు’ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఈ సంక్రాంతి విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బన్ని తోడుగా త్రివిక్రమ్ మేనియాతో ఓవర్సీస్‌లో ఈ సినిమా రచ్చ చేస్తోంది. ఈ సినిమా సక్సెస్‌తో అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మరింత పెంచాడు. ఈ సంక్రాంతి పండగను చిరంజీవి ఇంట్లో మిగతా మెగా హీరోలతో సెలబ్రేట్ చేసుకున్న అల్లు అర్జున్.. ఈవెనింగ్ మాత్రం తన భార్య స్నేహతో కలిసి ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని సామజవరగమన పాటను హమ్ చేసాడు. ఈ సంక్రాంతి అల్లు అర్జున్ ఇంట్లో జరిగిందా లేకపోతే వేరే చోట జరిగిందా అనేది తెలియకపోయినా.. ఈ సంక్రాంతిని మాత్రం ఎంతో ఉత్సాహంగా తన భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో బన్ని ఎంతో ఎంజాయ్ చేసాడు. ఈ వీడియోను అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమా విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 81  కోట్ల గ్రాస్ వసూళు చేసినట్టు  ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు