అల్లు అర్జున్ ఇంట్లో హోలీ సంబ‌రాలు.. మెగా కుటుంబం సందడే సంద‌డి..

ఏదైనా పండ‌గ వ‌చ్చిందంటే అంతా ఒకేచోట చేరి జ‌రుపుకోవ‌డం మెగా కుటుంబానికి ఎప్ప‌ట్నుంచో ఉన్న అల‌వాటు. అలాంటిది హోలీ లాంటి పండ‌గ మాత్రం వాళ్ళెందుకు వ‌దిలిపెడ‌తారు. పైగా అక్క‌డ అల్లు అర్జున్ లాంటి హీరో ఉన్నాడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 21, 2019, 4:35 PM IST
అల్లు అర్జున్ ఇంట్లో హోలీ సంబ‌రాలు.. మెగా కుటుంబం సందడే సంద‌డి..
అల్లు అర్జున్ హోలీ సెలెబ్రేషన్స్
  • Share this:
ఏదైనా పండ‌గ వ‌చ్చిందంటే అంతా ఒకేచోట చేరి జ‌రుపుకోవ‌డం మెగా కుటుంబానికి ఎప్ప‌ట్నుంచో ఉన్న అల‌వాటు. అలాంటిది హోలీ లాంటి పండ‌గ మాత్రం వాళ్ళెందుకు వ‌దిలిపెడ‌తారు. పైగా అక్క‌డ అల్లు అర్జున్ లాంటి హీరో ఉన్నాడు.. ఆయ‌న అల్ల‌రి చేయ‌డంలో నెంబ‌ర్ వ‌న్. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈ హీరో. కుటుంబాన్ని మొత్తం ఒక ద‌గ్గ‌రికి తీసుకొచ్చి హోలీ సంబ‌రాలు చేసుకున్నారు. అల్లు అర్జున్‌తో పాటు మెగా కుటుంబ స‌భ్యులు కూడా ఈ వేడుక‌లో పాల్గొన్నారు.
Allu Arjun celebrates Holi with his Family.. He will join with Trivikram Srinivas Soon pk.. ఏదైనా పండ‌గ వ‌చ్చిందంటే అంతా ఒకేచోట చేరి జ‌రుపుకోవ‌డం మెగా కుటుంబానికి ఎప్ప‌ట్నుంచో ఉన్న అల‌వాటు. అలాంటిది హోలీ లాంటి పండ‌గ మాత్రం వాళ్ళెందుకు వ‌దిలిపెడ‌తారు. పైగా అక్క‌డ అల్లు అర్జున్ లాంటి హీరో ఉన్నాడు.. allu arjun,allu arjun twitter,allu arjun holi celebrations,allu arjun family,allu arjun movies,allu arjun trivikram movie,allu arjun sukumar movie,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ హోలీ సెలెబ్రేషన్స్,అల్లు అర్జున్ హోలీ,అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్,తెలుగు సినిమా,అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా,అల్లు అర్జున్ సుకుమార్
అల్లు అర్జున్ హోలీ సెలెబ్రేషన్స్


చిరంజీవి కూతుళ్లు సుష్మిత‌, శ్రీజ‌తో పాటు నిహారిక కొణిదెల కూడా ఈ హోలీలో పాల్గొంది. ఇక బ‌న్నీ భార్య స్నేహా రెడ్డి.. ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా హోలీ పండ‌గను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. బ‌న్నీ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్, సుకుమార్ సినిమాల‌కు క‌మిట‌య్యాడు. ఇందులో ముందుగా త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో ట‌బు హీరో త‌ల్లిగా న‌టిస్తుందని తెలుస్తుంది.
First published: March 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading