హోమ్ /వార్తలు /సినిమా /

అల్లు అర్జున్ ఇంట్లో కొత్త సభ్యుడు.. ఆనందంలో బన్ని ఫ్యామిలీ..

అల్లు అర్జున్ ఇంట్లో కొత్త సభ్యుడు.. ఆనందంలో బన్ని ఫ్యామిలీ..

అల్లు అర్జున్ (Source: Facebook)

అల్లు అర్జున్ (Source: Facebook)

Allu Arjun |అల్లు అర్జున్ ఇంట్లో కొత్త సభ్యుడు వచ్చాడు. దీంతో బన్ని ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంది. వివరాల్లోకి వెళితే..

అల్లు అర్జున్ ఇంట్లో కొత్త సభ్యుడు వచ్చాడు. దీంతో బన్ని ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా మనం ఇంట్లో పెంచుకునే జంతువులకు పేరు పెట్టి పిలుస్తుంటాము కదా. ఇపుడు అదే రీతిలో  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అదే రీతిలో తాను కొన్న కొత్త రేంజ్ రోవర్ కారుకు ‘బీస్ట్’ అనే ముద్దు పేరు పెట్టుకున్నాడు. ఇక ప్రపంచంలో అగ్ర దేశాధినేతగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ అధికారికి వాహనం పేరు కూడా ‘బీస్ట్’ కావడం గమనార్హం. ఈ సందర్భంగా కొత్త కారుతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇప్పటి నుంచి ఈ కారు నా కుటుంబంలో ఒకటి అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అల.. వైకుంఠపురంలో’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత సుకుమార్ సినిమా చేయనున్నాడు. వీటితో పాటు బోయపాటి శ్రీనుతో సినిమాకు కమిటైనట్టు సమాచారం.

First published:

Tags: Ala Vaikunthapuramulo, Allu Arjun, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు