ALLU ARJUN BLOCKBUSTER MOVIE ALA VAIKUNTHAPURRAMLOO RELEASING IN HINDI ON 26 JANUARY 2022 HERE IS THE FIRST LOOK TA
Allu Arjun - Ala Vaikunthpurramloo : అల్లు అర్జున్.. ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ వెర్షన్ విడుదల తేది ఖరారు..
హిందీలో ‘అల వైకుంఠపురములో’ (twitter/Photo)
Allu Arjun - Ala Vaikunthpurramloo : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలవైకుంఠపురములో.. ఈ సినిమా 2020లో సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను ఈ నెల 26న హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేయనున్నారు.
Allu Arjun - Ala Vaikunthpurramloo : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలవైకుంఠపురములో.. ఈ సినిమా 2020లో సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం పూటకో రికార్డును మటాష్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రలో బుట్టబొమ్మ సాంగ్ 721 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి తెలుగులో సరికొత్త రికార్డు నమోదు చేసింది. మరోవైపు రాములో రాములో పాట 442 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. మరోవైపు సామజవరగమన పాట కూడా 208 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన 100 వీడియో సాంగ్స్‌లో బుట్టబొమ్మ 15వ స్థానంలో నిలిచింది.
తాజాగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్లో కార్తీన్ ఆర్యన్ హీరోగా ‘షెహదాదా’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. అల ఉంటే.. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్‌తో ఈ నెల 26న రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే ‘పుష్ప’తో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో హిందీలో ఓమైక్రాన్ నేపథ్యంలో హిందీలో సరైన పెద్ద సినిమాలు విడుదల కానీ ఈ టైమ్‌లో ‘పుష్ప’ సినిమాతో వచ్చిన ఇమేజ్ను హిందీలో క్యాష్ చేసుకోనే పనిలో ఉన్నారు చిత్ర నిర్మాతలు. అందుకే హిందీలో ఓ వైపు ‘అల వైకుంఠపురములో’ మూవీ రీమేక్ అవుతున్నా.. ఇపుడు సడెన్‌గా హిందీ డబ్బింగ్ వెర్షన్‌తో ఎంతో కొంత రాబట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు కనపడుతోంది.
పుష్ప సినిమాకు 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు రూ. 171 కోట్ల షేర్ వచ్చింది. సినిమా అయితే హిట్ అనిపించుకుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా సేఫ్ అవ్వలేదు పుష్ప. ఇక్కడ మరో రూ. 15 కోట్లు రావాలి. నాలుగో వీకెండ్ సినిమాను ఓటిటిలో విడుదల చేయడంతో కలెక్షన్స్ ఆగిపోయాయి. అందుకే తెలుగులో మినహా అన్నిచోట్ల సినిమా సేఫ్ అయింది.
‘పుష్ప’ మూవీ గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈమూవీ నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. పుష్ప హిందీ వెర్షన్ మంచి వసూళ్లనే దక్కించుకుంది. నార్త్‌లో పుష్ప రాజ్ తన సత్తాను చాటాడు. ముఖ్యంగా కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టింది. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప. మరి ఇపుడు హిందీలో విడుదల కాబోతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.