అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే ట్రీట్ రెడీ...

ఇదిలా ఉంటే తెలుగు సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేయడం అనేది కామన్ అయిపోయింది. ప్రస్తుతం జెర్సీతో పాటు మరో రెండు మూడు సినిమాలను కూడా అక్కడ రీమేక్ చేయబోతున్నారు.

శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుందని... అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ కన్‌ఫామ్ అయ్యిందని ప్రచారం జరిగింది.

  • Share this:
    ఫ్యాన్స్‌కు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ట్రీట్ సిద్ధమైంది. ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్ లోగోను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్ ఖరారైనట్టు వార్తలు వచ్చాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుందని... అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ కన్‌ఫామ్ అయ్యిందని ప్రచారం జరిగింది. అయితే దీన్ని చిత్ర యూనిట్ ఖండించింది. దీంతో ఈ సినిమాకు ఏ టైటిల్ అనుకుంటున్నారో అనే ఆసక్తి అల్లు అర్జున్ అభిమానుల్లో నెలకొంది. అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో మంచి జోష్ మీదున్న బన్నీ... తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

    ఇక రంగస్థలం వంటి హిట్‌తో తన రేంజ్‌ను మరింత పెంచుకున్న సుకుమార్... బన్నీతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాపై అంచనాలు టైటిల్‌తోనే పెరిగిపోతాయనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారనే అంశంపై సినీవర్గాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా... అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది.
    Published by:Kishore Akkaladevi
    First published: