HBD AlluArjun: అందుకే అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ అయ్యాడు..

Allu Arjun | చేసినవి కొన్ని చిత్రాలైనా  తనదైన నటన డాన్స్, ఫైట్స్ .. లతో టాలీవుడ్లో నయా ట్రెండ్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు..  కేరళ చలన చిత్ర పరిశ్రమలో తనదైన స్టైలిష్ నటనతో అభిమానులను సంపాదించుకొన్న దేశముదురు. ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 8, 2020, 7:50 AM IST
HBD AlluArjun: అందుకే అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ అయ్యాడు..
అల్లు అర్జున్ పుట్టినరోజు (Twitter/Photo)
  • Share this:
చేసినవి కొన్ని చిత్రాలైనా  తనదైన నటన డాన్స్, ఫైట్స్ .. లతో టాలీవుడ్లో నయా ట్రెండ్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు..  కేరళ చలన చిత్ర పరిశ్రమలో తనదైన స్టైలిష్ నటనతో అభిమానులను సంపాదించుకొన్న దేశముదురు. తెలుగులో తన సిక్స్ ప్యాక్ తో యూత్ ని అలరించిన స్టైలిష్ స్టార్. అతడే అల్లు నటవారసుడు అల్లు అర్జున్. మెగా నట వారుసుడు హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అల్లు  అర్జున్..1983 ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు జన్మించాడు . చిన్నప్పుడే తన మామ చిరు నటించిన ‘విజేత’ చిత్రంలో బాలనటుడిగా మెరిసాడు. ఆ తర్వాత చిరంజీవి యాక్ట్ చేసిన ‘డాడీ’ చిత్రంతో  చిన్నరోల్ లో కనిపించి మురిపించాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన గంగోత్రితో హీరోగా ప్రమోషన్ పొందాడు. అంతేకాదు టాలీవుడ్‌లో హీరోగా పదిహేడేళ్లు కంప్లీట్ చేసుకున్నాడు.

అల్లు అర్జున్ కెరీర్‌కు 17 ఏళ్లు పూర్తి (allu arjun 17 years career)
అల్లు అర్జున్ కెరీర్‌కు 17 ఏళ్లు పూర్తి (allu arjun 17 years career)


స‌రిగ్గా 17 ఏళ్ల కింద అల్లు అర్జున్ తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు. ఆయ‌న వ‌చ్చిన‌పుడు ఎవ‌రీ కుర్రాడు ఇలా ఉన్నాడు..? బ్యాగ్రౌండ్ ఉంటే ఎలా ఉన్నా హీరో అయిపోవ‌చ్చా..? ప్రేక్ష‌కుల ముందుకు తోసేసి.. వాళ్లపైకి రుద్దేస్తారా.. అంటూ చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. బ‌హుశా తెలుగులో ఏ వార‌సుడిపై కూడా ఈ స్థాయి విమ‌ర్శ‌లు రాలేదు. కానీ అల్లు అర్జున్‌పై వ‌చ్చాయి. గంగోత్రి విడుద‌లైన‌పుడు చాలా మంది తిట్టారు కూడా. కానీ అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు ఆ హీరోను చూసి వావ్ అంటున్నాయి. అత‌డే అల్లు అర్జున్.. వ‌న్ అండ్ ఓన్లీ స్టైలిష్ స్టార్ ఆఫ్ తెలుగు ఇండ‌స్ట్రీ. తండ్రి టాలీవుడ్‌ను శాసిస్తున్న టాప్ ప్రొడ్యూసర్. మామ చిరు మెగాస్టార్ గా ప్రేక్షక నీరాజనాలందుకున్న నటుడు. అల్లు రామలింగయ్య గురించైతే చెప్పక్కర్లేదు. తనదైన హాస్యంతో తెలుగు తెరను  ‘అల్లు’కుపోయిన గొప్ప నటుడు. ఇంత పెద్ద సపోర్టు ఉన్నా.. దాన్ని ఎంట్రీ వరకే వాడుకుని తాను పోషించే పాత్రలకు వందకు వంద శాతం న్యాయం చేస్తూ దూసుకుపోతున్నాడు.

Happy Birthday Allu Arjun intresting facts about the stylish star ,allu arjun,allu arjun birthday,happy birthday allu arjun,allu arjun twitter,allu arjun career 17 years,allu arjun gangotri march 28 2003,allu arjun movies,allu arjun career 17 years completed,allu arjun super market,allu arjun in super market for goods,allu arjun super market with mask,allu arjun family,allu arjun grandmother,allu arjun corona holidays family,allu arjun son ayaan,allu arjun arha,allu arjun sukumar movie,allu arjun sukumar movie opening,allu arjun sukumar movie muhurtam,dil raju,allu arjun dil raju,dil raju allu arjun icon movie,Allu Arjun,Allu Arjun twitter,Allu Arjun facebook,Allu Arjun instagram,Allu Arjun movies,Allu Arjun trivikram,Allu Arjun sukumar,Allu Arjun venu sriram,allu arjun arya,allu arjun arya 2,Allu Arjun icon movie,Allu Arjun trivikram srinivas,Allu Arjun planning,Allu Arjun naa peru surya movie,telugu cinema,అల్లు అర్జున్,అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్,అల్లు అర్జున్ సూపర్ మార్కెట్,సూపర్ మార్కెట్‌లో సరుకులు కొంటున్న అల్లు అర్జున్,అల్లు అర్జున్ కెరీర్‌కు 17 ఏళ్లు,అల్లు అర్జున్ సుకుమార్ సినిమా,తెలుగు సినిమా,అల్లు అర్జున్ పుట్టినరోజు,హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్
అల్లు అర్జున్ (Twitter/Photo)


హీరోగా తొలి సినిమా ‘గంగోత్రి’ నుంచి ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ చేసే ప్రతి చిత్రంలో వైవిధ్యాన్ని ఆవిష్కరించాడు. ఈ యేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. దీంతో పాటు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఒక సినిమా చేస్తున్నాడు.  మరోవైపు దిల్ రాజు నిర్మాణంలో MCA ఫేమ్ దర్శకత్వంలో ‘ఐకాన్’  సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ సినిమాకు కనబడుటలేదు అనేది ట్యాగ్ లైన్. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేదు.

allu arjun sukumar movie update on the eve of bunny birthday,allu arjun,allu arjun birthday,allu arjun birthday gift,allu arjun,sukumar,allu arjun sukumar,allu arjun sukumar clash,allu arjun sukumar devi sri prasad issue,allu arjun sukumar thaman issue,jabardasth,jabardasth comedy show,Jabardasth anchor anasuya bharadwaj,ala vaikunthapurramloo collections,ala vaikunthapurramloo allu arjun,anasuya bharadwaj twitter,allu arjun anasuya bharadwaj,jabardasth anchor anasuya yatra movie,jabardasth comedy show,jabardasth anasuya remuneration,anasuya bharadwaj,anasuya bharadwaj twitter,anasuya bharadwaj facebook,anasuya bharadwaj chiranjeevi,anchor anasuya,jabardasth anasuya,anasuya,jabardasth anchor anasuya hot photos,jabardasth anchor anasuya hot videos,jabardasth anchor anasuya hot songs,jabardasth anchor anasuya item songs,jabardasth anchor anasuya,extra jabardasth,anchor anasuya bharadwaj,anchor anasuya family photos,anasuya dance,anasuya family,jabardasth anchor anasuya bharadwaj all telugu movies list,anasuya bharadwaj dance,anchor anasuya dance,anasuya bharadwaj serious warning,jabardasth anchor anasuya bharadwaj movies list,jabardasth latest promo,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ చిరంజీవి,అనసూయ భరద్వాజ్ ట్విట్టర్,అనసూయ భరద్వాజ్ కొరటాల శివ,తెలుగు సినిమా,అల వైకుంఠపురములో, అల వైకుంఠపురములో కలెక్షన్స్, అల్లు అర్జున్ సుకుమార్ థమన్,అల్లు అర్జున్ థమన్ దేవీశ్రీ ప్రసాద్,అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్, అల్లు అర్జున్ పుట్టినరోజు కానుక
అల్లు అర్జున్ (File/Photo)


ఈ 17 ఏళ్ల ప్ర‌యాణంలో తెలుగు వాళ్ళ‌తో పాటు మ‌ళ‌యాలీ ప్రేక్ష‌కుల మ‌న‌సు కూడా దోచుకున్నాడు అల్లు అర్జున్. అక్క‌డి వాళ్ల‌తో మ‌ల్లు అర్జున్ అని పిలిపించుకున్నాడు బ‌న్నీ. అంతేకాదు ప్రస్తుతం కరోనా విలయ తాండవం వేళ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ. 50 లక్షల విరాళం, కేరళ ప్రజల రుణం తీర్చుకోవడానికి రూ. 25 లక్షల విరాళం, అంతేకాదు టాలీవుడ్ కార్మికుల కోసం ఉద్దేశించిన కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రూ.20 లక్షల విరాళం అందజేసారు. మొత్తంగా రూ. 1 కోటి 45 లక్షల విరాళం ఇచ్చిన తన పెద్ద మనసు చాటుకున్నాడు. మొత్తానికి నువ్వేం హీరోవురా బాబూ అన్న నోళ్ళతోనే హీరో అంటే నువ్వేరా బాబూ అనిపించుకున్నాడు అల్లు అర్జున్.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 8, 2020, 7:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading