Allu Arjun : ప్రముఖ విద్యాసంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్.. వీడియో వైరల్..

అల్లు అర్జున్ Photo : Twitter

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అది అలా ఉంటే ఆయన ఒక టాప్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా  మారరని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అది అలా ఉంటే ఆయన ఒక టాప్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా  మారరని తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండడంతో గతంలో అనేక అగ్ర కంపెనీలు తమ బ్రాండ్‌లకు ప్రచారం చేయడానికి అల్లు అర్జున్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నాయి. కానీ ఆయన మొదటిసారి ఓ విద్యాసంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. అల్లు అర్జున్ శ్రీ చైతన్య విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌ అయ్యారు. శ్రీ చైతన్య విద్యా సంస్థ 1986 లో విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల ప్రారంభంతో తన చారిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించింది. విద్యా రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న శ్రీచైతన్య వారు నిన్న దసరా సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ యాడ్’లో అల్లు అర్జున్ “ఐఐటి సక్సెస్ కోసం శ్రీ చైతన్య”, “మీ సక్సెస్ కోసం శ్రీ చైతన్య ని ఎంచుకోవడంలో మాత్రమ్ తగ్గేదే లే” అంటోన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఇక అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ సుకుమార్ (Allu Arjun Sukumar) కాంబినేషన్‌లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది.


    ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న  (Rashmika Mandanna) నటిస్తోంది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

    Balakrishna | Akhanda : బాలకృష్ణపై భారీ ఆశలు పెట్టుకున్న దిల్ రాజు.. అఖండ నైజాం రైట్స్ అంత ధర పలికాయా...

    ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. దీంతో ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగాన్ని అటవీ నేపథ్యంలో జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంత భాగాన్ని కేరళలో చిత్రీకరించారు.

    Happy Birthday Keerthy Suresh : కీర్తి సురేష్ తల్లి ఓ పాపులర్ హీరోయిన్ అని తెలుసా...

    ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే  వస్తోందని టాక్. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఈ సినిమా వచ్చే క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

    ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవ్వడంతో డిసెంబర్‌లో వేణు శ్రీరామ్ ఐకాన్ మొదలు కానుందని తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడికానున్నాయి.
    Published by:Suresh Rachamalla
    First published: