Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: February 23, 2019, 6:43 PM IST
రానా అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ
రానా దగ్గుపాటికి ఇప్పుడు ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి కంటే ముందు నుంచే ఆయన నేషనల్ వైడ్ ఇమేజ్ ఉన్న నటుడు. ఇక ఇప్పుడు ఈయన తన తోటి నటులు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. వాళ్లతో రానాకు ఉన్న చనువుతోనే ఈ కామెంట్స్ చేసాడు దగ్గుపాటి వారసుడు. అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్యే హిందీలో విడుదలై మంచి వసూళ్లు సాధిస్తున్న రణ్ వీర్ సింగ్ గల్లీ బాయ్ గురించి మొదలైంది ఈ రచ్చ.

రానా విజయ్ దేవరకొండ
ఈ సినిమాను తెలుగులో ఎవరు రీమేక్ చేస్తే బాగుంటుందని ఓ ఇంగ్లీష్ డైలీ పోల్ నిర్వహించింది. అందులో మూడు ఆప్షన్స్ కూడా ఇచ్చింది. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రానా.. ఈ ముగ్గురిలో ఎవరితో గల్లీ బాయ్ రీమేక్ చేస్తే బాగుంటుంది చెప్పండంటూ ప్రేక్షకులనే అడిగారు. అందులో ఎక్కువ భాగం రానా నటిస్తే బాగుంటుందని చెప్పారు. మరీ ముఖ్యంగా రణ్ వీర్ సింగ్, అలియా భట్ మధ్య ఉన్న లిప్ లాక్స్ ప్లస్ రొమాన్స్ రానా అయితే బాగా చేస్తాడని ఆయన అభిమానులు చెప్పారు.

రానా గల్లీ బాయ్ రీమేక్
అది రానా వరకు రావడంతో మనోడు ఇంకా వెరైటీగా స్పందించాడు. ఇలాంటి లిప్ లాక్ సీన్స్ చేయాలంటే తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలున్నారు.. తనకంటే బాగా విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఈ విషయంలో తోపులు అని చెప్పాడు. వాళ్లకే గల్లీ బాయ్ రీమేక్ సూట్ అవుతుందని సరదాగా సెటైర్ వేసాడు రానా. పైగా రణ్ వీర్ సింగ్ స్థాయిలో నటించే సత్తా తనకు లేదని ఓన్ సెటైర్ కూడా వేసుకున్నాడు ఈ హీరో.
First published:
February 23, 2019, 6:42 PM IST