పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ‘మేడిన్ ఇండియా’ ప్లాన్...

అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ చేపట్టిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప కోసం చాలా ప్లాన్లే వేస్తున్నారు.

news18-telugu
Updated: May 10, 2020, 5:23 PM IST
పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ‘మేడిన్ ఇండియా’ ప్లాన్...
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Photo)
  • Share this:
అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ చేపట్టిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప కోసం చాలా ప్లాన్లే వేస్తున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల క్యాస్టింగ్ పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్న ఈ సినిమాను అంతే స్థాయిలో గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కలసి ఈ సినిమా కోసం ఓ మెగా యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. సినిమాలో ఆరు నిమిషాల పాటు ఉండే ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం నిర్మాతలు రూ.6 కోట్లు ఖర్చు పెట్టబోడున్నారట. దీంతోపాటు ఈ సినిమాకు గతంలో ఫారెన్ ఫైట్ మాస్టర్‌ కిచ్చాను తీసుకోవాలని అనుకున్నారు. అయితే లాక్ డౌన్ వల్ల భారతీయ ఫైట్ మాస్టర్‌నే తీసుకోనున్నారు. సినిమాలో నటీనటులు, టెక్నికల్ టీం అంతా కూడా భారతీయ సినీ పరిశ్రమకు చెందిన వారే ఉండేలా మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఓ రకంగా పూర్తి మేడిన్ ఇండియా సినిమాగా దీన్ని మలచనున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలంటే ఫారెన్ లొకేషన్లలో షూటింగ్‌లు, పాటలు, ఫైట్ సీన్లు వగైరా ఉంటాయి. అయితే, ఈ సినిమాలో అవేవీ లేకుండా మొత్తం షూటింగ్ భారత్‌లోనే అది కూడా ఇండియన్ టెక్నీషియన్లతోనే చేయాలని చూస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 10, 2020, 5:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading