Allu Arjun - Koratala siva: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత చేయబోతున్న కొరటాల శివ సినిమా షూటింగ్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట.
బాబూ సైడ్.. సైడ్ ప్లీజ్... సైడ్ ఇవ్వండమ్మా... ఇచ్చేయాల్సిందే.. ముందు నేనే ఖర్చీఫ్ వేస్తున్నా అని త్వరలోనే బన్నీ అనబోతున్నారు. ఆయన డైరక్ట్ గా కాకపోయినా, ఆయన తరఫున కొరటాల అనేస్తారు. అప్పుడెప్పుడో మెగా కాంపౌండ్‌లో మొదలైన ఆచార్య సినిమా.. సాగి.. సాగి... ఇంకా సాగుతూనే ఉంది. అందులో నుంచి త్వరగా బయటపడాలనుకున్నారో, పడేసేవారుంటే బావుంటుందని అనుకున్నారోగానీ, కొరటాలను కాపాడటానికి బన్నీ ముందుకొచ్చారు. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, కొరటాలతో మూవీని అనౌన్స్ చేసేశారు. లాక్డౌన్ టైమ్ లో ఆన్లైన్లోనే స్టోరీల డిస్కషన్లు పూర్తయ్యాయి.అటూ ఇటూగా ఇప్పుడు ఆచార్య పనులు కూడా కాస్త కొలిక్కి వస్తున్నాయి. అందుకే సైడ్ బై సైడ్ బన్నీ సినిమా కోసం కాస్త వేగంగానే పావులు కదుపుతున్నారు కొరటాల. తన ప్రొడ్యూసర్ కమ్ ఫ్రెండ్ సుధాకర్ మిక్కిలినేనికి చెప్పి ఆఫీసు తీయించేశారు.
అక్కడే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయట. షెడ్యూల్ ప్లానింగులు, కేరక్టర్లకి కాస్ట్యూమ్ డిజైనింగులు, లొకేషన్ సెర్చింగులు... ఇలా చిన్నా చితకా పనులతో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారట మేకర్స్. ఒన్స్ పుష్ప షూట్ అలా పూర్తవగానే, వితౌట్ ఎనీ గ్యాప్ కొరటాల క్యాంప్‌కి షిప్ట్ అవడానికి బన్నీ రెడీ. ఇటు స్క్రిప్ట్ రెడీ. సో మిగిలిన పనులు కూడా పూర్తయితే త్వరలోనే మొదలుపెట్టాలన్నది ప్లాన్. ఈ సినిమాను 2022 సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని బన్నీ ఫ్యాన్స్ పిచ్చ వైరల్ చేస్తున్నారు.
అనౌన్స్ మెంట్, అందులోనూ ప్రీ ప్రొడక్షన్ అనౌన్స్మెంటే ఈ రేంజ్లో ఉంటే, సినిమా ప్రోగ్రెస్‌లో ఉన్నప్పుడు ఇంకెన్ని ట్రెండ్స్ సృష్టిస్తుందో అంటూ వాళ్లకు వాళ్లే కామెంట్లు కూడా పెట్టేసుకుంటున్నారు. సో అదన్నమాట అల్లువారబ్బాయి సమ్మర్ కా కహానీ.