పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఎప్రిల్ 8 పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈయన బర్త్ డేను నేషనల్ వైడ్ ట్రెండింగ్ చేసారు పవన్ ఫ్యాన్స్. జూనియర్ పవర్ స్టార్ అంటూ ఇప్పట్నుంచే రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అకిరా నందన్ పుట్టిన రోజుకు చిరంజీవి నుంచి అందరూ విషెస్ చెప్పారు. కొత్తగా ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. చిన్నప్పటి అకిరాను ఎత్తుకుని పవర్ ఫుల్ ఫ్యూచర్ ఉండాలంటూ దీవించాడు. నువ్వు అందరికంటే ఎత్తు ఎదిగావు.. కెరీర్లో కూడా అలాగే ఎదగాలి నాన్న అంటూ ట్వీట్ చేసాడు చిరంజీవి. ఇక రామ్ చరణ్ కూడా తమ్ముడికి హ్యాపీ బర్త్ డే చెప్పాడు.
వరుణ్ తేజ్ అయితే చివరికి తనకు పోటీగా ఒకడొచ్చాడు.. హ్యాపీ బర్త్ డే తమ్ముడు అంటూ ట్వీట్ చేసాడు. సాయి ధరమ్ తేజ్ కూడా హ్యాపీ బర్త్ డే టూ అకిరా నందన్ అంటూ ట్వీట్ చేసాడు. మెగా కుటుంబంలో అందరూ అకిరాకు శుభాకాంక్షలు తెలిపారు.. ఆ ఇద్దరు తప్ప. వాళ్లే అల్లు శిరీష్, అల్లు అర్జున్. పవన్ కూడా చెప్పలేదు కానీ ఆయన అంటే తండ్రి.. పైగా తన ట్విట్టర్లో పార్టీ వ్యవహారాలు, ప్రజా సమస్యలే తప్ప సొంత విషయాలెప్పుడూ ట్వీట్ చేయలేదు పవర్ స్టార్.
దాంతో ఆయన్ని పక్కనబెడితే అల్లు అర్జున్, అల్లు శిరీష్ మాత్రం అకిరాకు విషెస్ చెప్పలేదు. ఈ ఇద్దరు అల్లు సోదరులు అకిరాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపకపోవడం ఆసక్తికరంగా మారిందిప్పుడు. పర్సనల్గా ఫోన్ కానీ చేసి చెప్పారేమో తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం అకిరాకు చెప్పలేదు.. మళ్లీ అఖిల్ అక్కినేనికి ఇద్దరూ బర్త్ డే విషెస్ తెలిపారు. మరి అదేం లాజిక్ అబ్బా అంటున్నారు నెటిజన్లు.
Published by:Praveen Kumar Vadla
First published:April 08, 2020, 22:04 IST