• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ALLU ARJUN AMONG YAHOOS MOST SEARCHED PERSON OF 2020 HERE IS FULL LIST SK

Yahoo: ఈ ఏడాది వీళ్ల గురించే ఎక్కువగా వెతికారు.. అల్లు అర్జున్ స్థానం ఎంతంటే?

Yahoo: ఈ ఏడాది వీళ్ల గురించే ఎక్కువగా వెతికారు.. అల్లు అర్జున్ స్థానం ఎంతంటే?

అల్లు అర్జున్ ‘పుష్ఫ’ (Twitter/Photo)

Yahoo's Most Searched Personality list: ప్రధాని మోదీ ..2017 నుంచి యాహూ మోస్ట్ సెర్చ్‌డ్ పర్సన్స్ జాబితాలో టాప్‌లో కొనసాగుతున్నారు. కానీ ఈ ఏడాది ఆయన రెండో స్థానంలో.. సుశాంత్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నారు.

  • Share this:
    సెలబ్రిటీల గురించి ఏం కావాలన్నా సెర్చ్ ఇంజిన్‌లో శోధిస్తాం. వారి సినిమాలు, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు.. ఎలాంటి సమాచారం కావాలన్న.. గూగుల్, యాహూలను ఆశ్రయిస్తాం. మరి ఈ ఏడాది ఎక్కువ మంది వెతికిన జాబితాను యాహూ ప్రకటించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించే ఎక్కువ మంది శోధించారని యాహూ తెలిపింది. ఆయన తర్వాతి స్థానంలో ప్రధాని మోదీ ఉన్నారు. ఇక సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మూడో స్థానంలో నిలిచింది. ఐతే 2017 నుంచి యాహూ మోస్ట్ సెర్చ్‌డ్ పర్సన్స్ జాబితాలో ప్రధాని మోదీ టాప్‌లో కొనసాగుతున్నారు. కానీ ఈ ఏడాది ఆయన రెండో స్థానంలో.. సుశాంత్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నారు. సుశాంత్ సింగ్ మరణం యావత్ దేశాన్ని షేక్ చేసింది. ఈ క్రమంలోనే కోట్లాది మంది ఆయన గురించి, మరణం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

    ఎక్కువ మంది వెతికిన సెలబ్రిటీల జాబితా:
    1. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
    2. నరేంద్ర మోదీ
    3. రియా చక్రవర్తి
    4. రాహుల్ గాంధీ
    5. అమిత్ షా
    6. ఉద్ధవ్ థాక్రే
    7. అర్వింద్ కేజ్రీవాల్
    8. మమతా బెనర్జీ
    9. అమితాబ్ బచ్చన్
    10. కంగనా రనౌత్


    ఇక సినిమా వాళ్ల విషయానికొస్తే.. పురుషుల జాబితాలో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్‌కు చోటుదక్కింది.  ఎస్సీ బాలసుబ్రమణ్యం, సోనుసూద్ కూడా ఆ లిస్టులో ఉన్నారు. ఇక మహిళ జాబితాలో అందరూ బాలీవుడ్ తారలే ఉన్నారు. పురుషుల జాబితాలో సుశాంత్, మహిళల జాబితాలో రియాకు తొలి స్థానాలు దక్కాయి.

    సినిమా సెలబ్రిటీల జాబితా (పురుషులు):
    1. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్
    2. అమితాబ్ బచ్చన్
    3. అక్షయ్ కుమార్
    4. సల్మాన్ ఖాన్
    5. ఇర్ఫాన్ ఖాన్
    6. రిషి కపూర్
    7. ఎస్సీ బాలసుబ్రమణ్యం
    8. సోను సూద్
    9. అనురాగ్ కశ్యప్
    10. అల్లు అర్జున్

    సినిమా సెలబ్రిటీల జాబితా (మహిళలు):
    1. రియా చక్రవర్తి
    2. కంగనా రనౌత్
    3. దీపికా పదుకోణ్
    4. సన్నీ లియోన్
    5. ప్రియాంక చోప్రా
    6. కత్రినా కైఫ్
    7. నేహా కాకర్
    8. కనికా కపూర్
    9. కరీనా కపూర్
    10. సారా అలీ ఖాన్
    Published by:Shiva Kumar Addula
    First published: