Allu Arjun - Pushpa: ‘పుష్ప’ కోసం స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ స్పెషల్ మేకప్

Allu Arjun alloting special time for Pushpa movie look

Allu Arjun - Pushpa: అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ పుష్ప కోసం బాగా కష్టపడుతున్నాడట. మేకప్ కోసం ప్రతి రోజూ రెండు గంటల సమయాన్ని వెచ్చిస్తున్నాడని టాక్.

  • Share this:
    స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ లేటెస్ట్‌ మూవీ 'పుష్ప' చిత్రీకరణలో బిజి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్యాన్‌ ఇండియా మూవీ 'పుష్ప'. ఈ సినిమాను ఆగస్ట్‌ 13న విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన 'పుష్ప' సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు. దీనికి సంబంధించి చిత్ర యూనిట్‌ అధికారిక ప్రకటనను వెలువరిచింది. తదుపరి షెడ్యూల్ కోసం ‘పుష్ప’ టీమ్ రెడీ అవుతోంది.

    ఇప్పటి వరకు స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తూ వ‌చ్చిన అల్లు అర్జున్‌..‘పుష్ప’ సినిమా కోసం ప్ర‌త్యేకమైన మాస్ అండ్ ర‌గ్డ్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌నే సంగ‌తి తెలిసిందే. ఈ లుక్ కోసం అల్లు అర్జున్ ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా కనిపించ‌డానికి లుక్ కోసం రోజూ రెండు గంటల పాటు మేకప్ వేసుకుంటున్నాడట. పుష్ప కోసం బన్నీ పడుతున్న కష్టం చూసి ప్యాన్ ఇండియా ఇమేజ్ కోసం బాగానే కష్టపడుతున్నాడని అంటున్నారు సినీ వర్గాలు.

    ఆర్య‌, ఆర్య 2 త‌ర్వాత అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్ర‌మిది. అంతే కాకుండా, రంగ‌స్థ‌లం వంటి భారీ హిట్ త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రమిది. రష్మిక మందన్న హీరోయిన్‌గా న‌టిస్తోంది.
    Published by:Anil
    First published: