అల వైకుంఠపురములో ఒరిజినల్ ప్రింట్ వచ్చేస్తుందహో..

Ala Vaikuntapurramuloo Sunnxt: అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాదు.. తెలుగు ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డులు సృష్టించిన సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నాన్ బాహుబలి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 21, 2020, 8:46 PM IST
అల వైకుంఠపురములో ఒరిజినల్ ప్రింట్ వచ్చేస్తుందహో..
అల వైకుంఠపురములో సన్ నెక్ట్స్ (ala vaikuntapurramuloo sunnxt)
  • Share this:
అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాదు.. తెలుగు ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డులు సృష్టించిన సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నాన్ బాహుబలి రికార్డులు అన్నీ బన్నీ పేరుమీదే ఉన్నాయిప్పుడు. ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తీపికబురు చెప్పారు దర్శక నిర్మాతలు. సన్ నెక్ట్స్ భారీ రేట్ ఇచ్చి మరీ అల వైకుంఠపురములో డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి ప్లాట్ ఫామ్స్ కాదని ఈ సినిమాను దీనికి అమ్మేసారు నిర్మాతలు. ఇదిలా ఉంటే ఒకప్పుడు విడుదలైన నెల రోజుల్లోనే ఒరిజినల్ ప్రింట్ విడుదలయ్యేది. కానీ అల వైకుంఠపురములో సినిమా విషయంలో మాత్రం అగ్రిమెంట్ 50 రోజులకు కుదుర్చుకున్నారు దర్శక నిర్మాతలు.

అందుకే జనవరి 12న విడుదలైన ఈ సినిమా.. ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సినిమా కోసం చాలా మంది అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. నాలుగు వారాల పాటు కలెక్షన్ల పంట పండించిన అల వైకుంఠపురములో.. ఐదో వారంలో కూడా అక్కడక్కడా షేర్స్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 40 రోజుల్లో 160 కోట్ల షేర్ చేరువగా తీసుకొచ్చింది. ఇప్పుడు ఒరిజినల్ ప్రింట్ వచ్చేస్తుండటంతో రన్ అయిపోయినట్లే. ఫిబ్రవరి 26న అల వైకుంఠపురములో స్ట్రీమ్ అవుతుందంటూ ప్రమోషన్ మొదలుపెట్టారు. ఇక మొత్తానికి డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో కూడా బన్నీ సినిమా రచ్చ చేస్తుందేమో చూడాలిక.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు