Home /News /movies /

ALLU ARJUN ALAVAIKUNTHAPURRAMULOO MOVIE ANOTHER EVENT AT KERALA TA

‘అల వైకుంఠపురములో’ కోసం అల్లు అర్జున్ మరో ఈవెంట్.. గెస్ట్‌గా సూపర్ స్టార్..

Instagram

Instagram

రీసెంట్‌గా ‘అల వైకుంఠపురములో’ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఈవెంట్‌కు ప్లాన్ చేసారు చిత్ర యూనిట్.

    అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్‌గా ‘అల వైకుంఠపురములో’ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు తన తండ్రి అల్లు అరవింద్‌కు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ చిత్రానికి సంబంధించిన మరో ఈవెంట్‌ను కేరళలో ప్లాన్ చేసినట్టు సమాచారం. మలయాళంలో అల్లు అర్జున్‌కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే ‘అల వైకుంఠపురములో’ సినిమాను మలయాళంలో ఒకేసారి రిలీజ్  చేస్తున్నారు. ఇప్పటికే మలయాళ వెర్షన్‌కు సంబంధించిన డబ్బింగ్ ఇతరత్రా అన్ని పనులు పూర్తైయ్యాయి. మలయాళ ప్రేక్షకుల కోసం బన్ని.. ఈ రెండు రోజుల్లో చిన్న ఈవెంట్‌ను ప్లాన్ చేసాడు. ఈ వేడుకకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య అతిథిగా రానున్నట్టు సమాచారం. మొత్తానికి అల్లు అర్జున్.. ‘అల వైకుంఠపురములో’ సినిమా తెలుగుతో మలయాళంలో ఒకేసారి రిలీజ్ కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ala Vaikunthapurramloo, Allu aravind, Allu Arjun, Malluwood, Mohanlal, Pooja Hegde, Tabu, Tollywood, Trivikram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు