కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోన్న బన్నీ అల వైకుంఠపురములో..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర అదరగొడుతోంది.

news18-telugu
Updated: January 21, 2020, 9:49 AM IST
కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోన్న బన్నీ అల వైకుంఠపురములో..
Twitter
  • Share this:
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర అదరగొడుతోంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా రెండు రాష్ట్రాల్లోతోపాటు అటూ ఓవర్సీస్‌లో కూడా ఇరగదీస్తోంది. చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాలకు మించిన ఆదరణ అల వైకుంఠపురంలో చిత్రానికి అక్కడ ఓవర్సీస్‌లో వస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం $3 మిలియన్ మార్కుని దాటివేసింది. ఫుల్ రన్‌లో ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. గతంలో రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం $3.5 మిలియన్ వసూళ్లతో నాన్ బాహుబలి రికార్డ్ సొంతం చేసుకున్న చిత్రంగా ఉంది. ఆ రికార్డ్‌ను అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కొద్దిరోజులలో సమం చేయటంతో పాటు ఆ రికార్డ్‌ను దాటివేసే అవకాశం ఉంది. బన్నీ త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. గతంలో ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాజా సినిమాలో పూజ హెగ్డే బన్నీకి జంటగా మరోసారి నటించింది. థమన్ సంగీతం అందించాడు. మిగితా ముఖ్య పాత్రల్లో టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, జయరామ్, రాజేంద్ర ప్రసాద్, సముద్ర ఖని, మురళీ శర్మ నటించారు.First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు