Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: January 3, 2020, 4:04 PM IST
అల వైకుంఠపురములో పోస్టర్ (ala vaikuntapurramuloo)
అల్లు అర్జున్ కొన్ని రోజుల నుంచి అల వైకుంఠపురములో సినిమాతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే పూర్తి చేసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మొదలుపెట్టడం ఆలస్యమైనా కూడా పూర్తి చేయడం మాత్రం తొందరగానే చేసాడు మాటల మాంత్రికుడు. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్ర సెన్సార్ పూర్తైపోయింది. ఇదే విషయాన్ని ట్విట్టర్లో అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. కొన్ని రోజులుగా నాన్ స్టాప్ షెడ్యూల్స్‌తో పిచ్చెక్కిస్తున్న త్రివిక్రమ్.. విడుదలకు 10 రోజుల ముందే అన్నీ పూర్తి చేసాడు.

అల వైకుంఠపురములో పోస్టర్
సినిమాలో ఫ్యామిలీ సీన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే ఉండటంతో యు బై ఏ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమాలో సునీల్ కామెడీ అదిరిపోతుందని.. ఇక అల్లు అర్జున్ కామెడీ కూడా మరో స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. ఫస్ట్ కాపీ కూడా సిద్ధం కావడంతో యూనిట్ అంతా హాయిగా ఉన్నారు. ఇక సెన్సార్ టాక్ కూడా పాజిటివ్‌గానే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు చిత్రయూనిట్. అల వైకుంఠపురములో చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా నా పేరు సూర్య లాంటి డిజాస్టర్ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది.

అల వైకుంఠపురములో’ సినిమా సెట్లో అల్లు అర్జున్‌కు సీన్ వివరిస్తున్న త్రివిక్రమ్ (twitter/Photo)
ఇప్పటికే విడుదలైన టీజర్.. పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడం కూడా దర్శక నిర్మాతలపై ఒత్తిడి పెంచేస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోటీ పడుతున్నాడు బన్నీ. ఈ సినిమా విడుదల తేదీ కూడా అనౌన్స్ చేయకుండా సంక్రాంతి రిలీజ్ అంటున్నారు. మరి చూడాలిక ఈ రెండు ఎప్పుడొస్తాయో..? జనవరి 15న మాత్రం కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా విడుదల కానుంది.. అందరికంటే ముందు జనవరి 9న రజినీకాంత్ దర్బార్ విడుదల కానుంది. మొత్తానికి సంక్రాంతి జోరు ఈ సారి భలేగా ఉండబోతుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
January 3, 2020, 4:04 PM IST