అల్లు అర్జున్ బుట్ట బొమ్మ సాంగ్ మరో అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం పూటకో రికార్డును మటాష్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ పాట మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.

news18-telugu
Updated: May 28, 2020, 11:45 AM IST
అల్లు అర్జున్ బుట్ట బొమ్మ సాంగ్ మరో అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే..
‘అల వైకుంఠపురములో’ బుట్టబొమ్మ సాంగ్ (Twitter/Photo)
  • Share this:
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం పూటకో రికార్డును మటాష్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ పాట మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పట్లో ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కావకపోవచ్చు. తాజాగా యూట్యూబ్‌లో బుట్ట బొమ్మ సాంగ్ 200 మిలియన్ వ్యూస్‌కు చేరువైంది. తెలుగులో అతి తక్కువ రోజుల్లో ఇన్ని వ్యూస్ వచ్చిన పాట ఏది లేదు. అంతేకాదు ఈ పాటకు లోకల్ నుంచి గ్లోబల్ లెవల్‌ వరకు అందరు ఫిదా అయ్యారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో పాటు శిల్పాశెట్టి, దిశా పటానీ వంటి హీరోయిన్స్ కూడా అల్లు అర్జున్ బుట్ట బొమ్మ సాంగ్‌కు ఫిదా అయ్యారు. తాజాగా బుట్టబొమ్మ సాంగ్ ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది అంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చేసాడు. తాజాగా ఓ ఇంగ్లీష్ డైలీలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేసిన థమన్.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన 100 వీడియో సాంగ్స్‌లో బుట్టబొమ్మ 15వ స్థానంలో నిలిచింది. వాల్డ్ వైడ్‌గా ఓ తెలుగు పాట 15వ స్థానం దక్కడం అంత ఈజీ విషయం కాదు. తెలుగు సినిమా స్థాయిని ఈ పాట పెంచిందని కామెంట్స్ రూపంలో అల్లు అర్జున్ అభిమానులు థమన్‌కు థాంక్స్ చెబుతున్నారు.

allu Arjun Ala Vaikunthapurramloo Music Album Creates 1 Billion Views News18
100 కోట్ల వ్యూస్ రాబట్టిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మ్యూజిక్ ఆల్బమ్ (Twitter/Photo)


అల వైకుంఠపురములో సినిమా విషయానికొస్తే.. ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అంతేకాదు అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌లో తమన్ సమకూర్చిన పాటలు కీ రోల్ పోషించాయి. ఇప్పటికే ఈ సినిమాలోని అన్ని పాటలు కలిసి 1 బిలియన్ వ్యూస్ రాబట్టినట్టు యూట్యూబ్ తెలిపింది. మొత్తంగా ఒక సినిమాలోని పాటల ఆల్బమ్ లిరికల్ ఫుల్ వీడియో సాంగ్స్ అన్ని కలిసి 100 కోట్ల వ్యూస్‌ను రాబట్టడం తెలుగులో ఇదే ఫస్ట్ టైమ్. ఈ రకంగా అల వైకుంఠపురములో సినిమా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ప్రపంచంలో టాప్ 15లో స్థానం దక్కడం మరో విశేషం.
First published: May 28, 2020, 11:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading