అల్లు అర్జున్ అల వైకుంఠపురములో.. అలా డబ్బింగ్ మొదలైంది..

అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగానే పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 11, 2019, 3:54 PM IST
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో.. అలా డబ్బింగ్ మొదలైంది..
అల్లు అర్జున్ సుశాంత్
  • Share this:
అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగానే పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. దాంతో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా అప్పుడే మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు అక్కినేని మేనల్లుడు సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈయన పాత్ర షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తైపోయింది. తాజాగా ఈయన తన పాత్రకు డబ్బింగ్ మొదలు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే అన్నయ్యగా సుశాంత్ నటిస్తున్నాడని తెలుస్తుంది.

ఈయన పాత్ర సినిమాలో కీలకం కానుంది. కచ్చితంగా ఈ కారెక్టర్ తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని భావిస్తున్నాడు సుశాంత్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్, బన్నీ కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా ఇప్పుడు బన్నీ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈయన గత సినిమా నా పేరు సూర్య డిజాస్టర్.. దానికి ముందు డిజే కూడా యావరేజ్.. దాంతో కచ్చితంగా ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తమన్ సంగీతం ఈ చిత్రానికి అనదపు ఆకర్షణ. హారిక హాసినితో కలిసి గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

First published: November 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...