హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun: అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మరో రికార్డు.. తెలుగులో ఒకే ఒక్కడు..

Allu Arjun: అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మరో రికార్డు.. తెలుగులో ఒకే ఒక్కడు..

‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ (Twitter/Photo)

‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ (Twitter/Photo)

Allu Arjun: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ సినిమా మరో రికార్డు నెలకొల్పొంది.

  Allu Arjun: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం పూటకో రికార్డును మటాష్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలోని బుట్టబొమ్మ సాంగ్ 475 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. మరోవైపు రాములో రాములో పాటతో పాట 264 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక సామజవరగమన వంటి ఫుల్ వీడియో సాంగ్ కూడా 148 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన 100 వీడియో సాంగ్స్‌లో బుట్టబొమ్మ ఇప్పటికే  15వ స్థానంలో నిలిచింది. తాజాగా 2020లో విడుదలైన టాప్ సాంగ్స్‌లో అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సాంగ్స్ యూట్యూబ్‌లో సెన్సెషన్ క్రియేట్ చేసిన టాప్ 10లో చోటు దక్కించుకుంది.

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తమన్ స్వరపరిచిన పాటలకు అల్లు అర్జున్, పూజా హెగ్డే  డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో ‘బుట్ట బొమ్మ సాంగ్ దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు ఇదే సినిమాలోని ‘రాములో రాములో’ పాట ఎనిమిదవ స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాదు 2020లో ఇండియా టాప్ 10 సాంగ్స్ లిస్టులో ఉన్న ఏకైక తెలుగు చిత్రం కూడా అల్లు అర్జున్, త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ కావడం విశేషం.

  మొత్తంగా ఈ యేడాది విడుదలైన బిగ్ హీరో చిత్రాల్లో అల్లు అర్జున్ .. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో పాటు మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మాత్రమే థియేటర్స్‌లో సందడి చేసాయి. కానీ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాకు త్రివిక్రమ్ మాయాజాలంతో పాటు పూజా హెగ్డే అందాలు.. తమన్ స్వరాలు తోడై ఈ సినిమాను బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేలా చేసాయి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Tollywood, Youtube

  ఉత్తమ కథలు