అల్లు అర్జున్‌కు పోటీ ఇస్తున్న మరో కథానాయకుడు..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అల వైకుంఠపురములో’.తాజాగా ఈ సినిమా..

news18-telugu
Updated: October 20, 2019, 6:24 PM IST
అల్లు అర్జున్‌కు పోటీ ఇస్తున్న మరో కథానాయకుడు..
‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ (Twitter/Photo)
  • Share this:
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అల వైకుంఠపురములో’. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే తగ్గట్టే ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమాలోని ‘సామజవరగమన’ పాట యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సామజవరగమన యూట్యూబ్‌లో ఎక్కువ మంది లైక్ చేసిన పాటగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాలో మరో పాటను ఈ సోమవారం సాయంత్రం రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు ‘అల వైకుంఠపురములో ’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన కాసేపటికే మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదల కానుంది.మరోవైపు ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు సుశాంత్ మరో హీరోగా నటిస్తున్నాడు.తాజాగా సుశాంత్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సుశాంత్ రాజ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు అసలు రాజ్ నామ్‌తో సునాహీ హోగా అంటూ పరిచయం చేసారు.గీతా ఆర్ట్స్ అండ్ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ ప్రత్యేక గీతంలో మెరవనుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 20, 2019, 6:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading