పాకిస్తాన్‌లో పాగా వేసిన అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో అక్కడ..

వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు బన్నీ నిజంగానే పాకిస్తాన్‌లో పాగా వేసాడు. అక్కడ కూడా తన సత్తా చూపిస్తున్నాడు. దానికి కారణం అల వైకుంఠపురములో సినిమా. అందులోని సామజవరగమనా పాట.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 22, 2020, 5:32 PM IST
పాకిస్తాన్‌లో పాగా వేసిన అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో అక్కడ..
అల వైకుంఠపురములో కలెక్షన్స్
  • Share this:
వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు బన్నీ నిజంగానే పాకిస్తాన్‌లో పాగా వేసాడు. అక్కడ కూడా తన సత్తా చూపిస్తున్నాడు. దానికి కారణం అల వైకుంఠపురములో సినిమా. అందులోని సామజవరగమనా పాట. కొన్ని పాటలకు భాషతో పనిలేదు. అవి బాగుంటే చాలు ఆటోమేటిక్‌గా హిట్ అవుతుంటాయి. అసలు భాష తెలియకపోయినా కూడా ఓన్ చేసుకుంటారు ఆడియన్స్. ఒక్క సంగీతానికే ఆ బలం ఉంది. భాషతో పనిలేని చాలా పాటలు ఎన్నో దేశాల్లో సంచలనాలు సృష్టించాయి. కొలవెరి డి, గంగ్నం స్టైల్ లాంటి పాటలు భాషతో సంబంధం లేకుండానే బంపర్ హిట్ అయ్యాయి. అల వైకుంఠపురములో సినిమాలోని సామజవరగమన పాట ఇదే మాయ చేస్తుందిప్పుడు.

Allu Arjun Ala Vaikuntapurramuloo movie Samajavaragamana Song going viral in Pakistan pk వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు బన్నీ నిజంగానే పాకిస్తాన్‌లో పాగా వేసాడు. అక్కడ కూడా తన సత్తా చూపిస్తున్నాడు. దానికి కారణం అల వైకుంఠపురములో సినిమా. అందులోని సామజవరగమనా పాట. samajavaragamana song pakistan,samajavaragamana song viral in pakistan,samajavaragamana song allu arjun pakistan,samajavaragamana song 100 million views,Samajavaragamana becomes the most views,telugu song on youtube and allu arjun shares a pic on instagram,samajavaragamana most liked song,allu arjun,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun samajavaragamana song,allu arjun ala vaikuntapuramlo,allu arjun ala vaikuntapurramuloo,allu arjun pooja hegde,allu arjun samajavaragamana song youtube,samajavaragamana,alavaikunthapuramuloo,hegde pooja,MusicThaman,sidsriram,sitaramasasthrigaru,సామజవరగమన,అల వైకుంఠపురములో,సామజవరగమనా 100 మిలియన్ వ్యూస్,తెలుగు సినిమా,మోస్ట్ లైక్డ్ సాంగ్‌గా సామజవరగమన,సామజవరగమన పాటకు 100 మిలియన్ వ్యూస్,సామజవరగమనా పాకిస్తాన్ వైరల్,పాకిస్తాన్‌లో సామజవరగమనా సాంగ్
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సాంగ్


ఈ పాట తెలుగులో చార్ట్ బస్టర్ అయింది. విడుదలైన క్షణం నుంచి నాలుగు నెలలుగా మాయ చేస్తూనే ఉంది. ఇప్పటికే కోట్లాది మంది ఈ పాటను విన్నారు. సామజవరగమనా పాట కేవలం మనదేశంలోనే కాకుండా మన శత్రు దేశమైన పాకిస్తాన్‌లోనూ వినిపిస్తుంది. అక్కడ కూడా ఈ పాటకు ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం పాక్ యువత సామజవరగమనా పాటను ఎంజాయ్ చేస్తున్నారు. భాష అర్థం కాకపోయినా కూడా ట్యూన్ బాగుండటంతో ఈ పాటను రిపీట్ మోడ్‌లో వింటున్నారు. సోషల్ మీడియాలో బన్నీ పాట కోసం తెగ వెతికేస్తున్నారు. మరోవైపు ఈ పాట సంచలనాలను ఎప్పటికప్పుడు నెటిజన్లు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో పోస్ట్ చేస్తున్నారు.

Allu Arjun Ala Vaikuntapurramuloo movie Samajavaragamana Song going viral in Pakistan pk వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు బన్నీ నిజంగానే పాకిస్తాన్‌లో పాగా వేసాడు. అక్కడ కూడా తన సత్తా చూపిస్తున్నాడు. దానికి కారణం అల వైకుంఠపురములో సినిమా. అందులోని సామజవరగమనా పాట. samajavaragamana song pakistan,samajavaragamana song viral in pakistan,samajavaragamana song allu arjun pakistan,samajavaragamana song 100 million views,Samajavaragamana becomes the most views,telugu song on youtube and allu arjun shares a pic on instagram,samajavaragamana most liked song,allu arjun,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun samajavaragamana song,allu arjun ala vaikuntapuramlo,allu arjun ala vaikuntapurramuloo,allu arjun pooja hegde,allu arjun samajavaragamana song youtube,samajavaragamana,alavaikunthapuramuloo,hegde pooja,MusicThaman,sidsriram,sitaramasasthrigaru,సామజవరగమన,అల వైకుంఠపురములో,సామజవరగమనా 100 మిలియన్ వ్యూస్,తెలుగు సినిమా,మోస్ట్ లైక్డ్ సాంగ్‌గా సామజవరగమన,సామజవరగమన పాటకు 100 మిలియన్ వ్యూస్,సామజవరగమనా పాకిస్తాన్ వైరల్,పాకిస్తాన్‌లో సామజవరగమనా సాంగ్
అల వైకుంఠపురములో సాంగ్ (Source: Youtube)




ఇప్పటికే కేరళలో సూపర్ ఫేమస్ అయిన బన్నీ సామజవరగమన పాటతో పాకిస్థాన్‌లోనూ పాపులర్ అయిపోతున్నాడు. ఈ క్రెడిట్ ఖచ్చితంగా తమన్‌దే. ఈ ఒక్క పాటతోనే సినిమాపై అంచనాలు పెంచేసాడు ఈ సంగీత దర్శకుడు. ఇదే విషయాన్ని త్రివిక్రమ్ కూడా ఒప్పుకున్నాడు. తమన్ లేకపోతే అల వైకుంఠపురములో సినిమా ఇంత పెద్ద విజయం సాధించేది కాదని ఆయనే చెప్పాడు. మొన్నీమధ్యే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ సామజవరగమనా పాటకు ఫిదా అయిపోయాడు. దావోస్ మీటింగ్ కోసం వెళ్లిన కేటీఆర్ ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తున్నట్టు ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. మొత్తానికి బన్నీ పాట సంచలనాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు