news18-telugu
Updated: January 7, 2020, 11:09 AM IST
వేణు శ్రీరామ్ కూడా ఇప్పుడు మెగా కంపౌండ్‌లోనే ఉన్నాడు. ఈయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఐకాన్ కూడా వర్కవుట్ చేసాడు. అయితే అది ఇప్పట్లో ఉండేలా కనిపించడం లేదు. మరికొందరు దర్శకులు కూడా వరసగా మెగా హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘అల వైకుంఠపురములో’. బన్ని, మాటల మాంత్రికుడు కాంబినేషన్లో వస్తున్న ఈ మూడో సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ పాటలు రికార్డులు సృష్టించాయి. ‘దువ్వాడ జగన్నాథం’ తర్వాత మరోసారి అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే యాక్ట్ చేసింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో స్టేజ్ పై మాట్లాడిన మాటలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిన్నటి ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. కట్టె కాలేవరకు మీతోనే ఉంటాను. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంది అంటూ చెప్పుకొచ్చరు. మీ ఆశీర్వాదం బలంతో ఇంకా ఇంకా దూసుకుపోతాను అని చెప్పిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నట్టు చేసాడు. ఇక నాకు పెద మామ చిరంజీవి అంటే ప్రాణం.. ఈ కట్టె కాలే వరకు చిరంజీవి అభిమానినే. ఇక చిరు తర్వాత రజినీకాంత్ అంటే తన కిష్టమన్నారు.

అల వైకుంఠపురములో పోస్టర్
ఇక రజినీకాంత్ నటించిన ‘దర్బార్’, మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ కళ్యాణ్ రామ్..‘ఎంత మంచివాడవురా’ చిత్రాలు సక్సెస్ కావాలన్నాడు. అంతేకాదు ఆయా చిత్ర బృందాలకు బెస్ట్ విషెస్ తెలియజేసాడు. ఐతే.. ఈ సందర్భంగా చిరంజీవి గురించి మాట్లాడిన అల్లు అర్జున్.. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అభిమానులు పవర్ స్టార్.. పవర్ స్టార్ అనే అరుస్తున్నట్టు కూడా అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాన్ గురించి ప్రస్తావించ లేదు. అప్పట్లో ‘ఒక మనసు’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే.. చెప్పను బ్రదన్ అంటూ చేసిన వ్యాఖ్యలు మెగా హీరోల మధ్య ఉన్న విభేదాలను బట్ట బయలు చేసింది. తాజాగా ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
January 7, 2020, 11:08 AM IST