స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ సినిమాను పక్కన పెట్టేసాడా.. ? నిజంగా బన్నికి ఆ సినిమా చేసే ఉద్దేశ్యం లేదా. వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత వరుసగా రెండు సినిమాలకు ఓకే చెప్పాడు. అందులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాకు ఓకే చెప్పాడు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు బన్ని. ఐతే. అల్లు అర్జున్.. అంతకు ముందు దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ మూవీని అనౌన్స్ చేసాడు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు.

‘ఐకాన్’ మూవీ లోగో (Twitter/Photo)
దిల్ రాజు విషయానికొస్తే... ఆయన ఓ కథను అంతగా ఈజీగా ఓకే చేయరు. కానీ దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ రీమేక్ బాధ్యతలను వేణు శ్రీరామ్ చేతిలో పెట్టాడు. ఇక అల్లు అర్జున్ ’పుష్ప’ తర్వాత ఐకాన్ సినిమా పట్టాలెక్కుతుందని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా బన్ని.. కొరటాల శివ సినిమాను ముందుకు తీసుకొచ్చాడు. అంతేకాదు తన 21 వ చిత్రం ఇదే నంటూ ప్రకటించాడు. దీంతో దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయబోయే ‘ఐకాన్’ సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అసలు ఈ సినిమాను అల్లు అర్జున్ సైడ్ చేసాడా ? తర్వాతనైనా చేస్తాడా అనేది చూడాలి. మొత్తంగా ‘ఐకాన్’ చిత్ర విషయమైన అల్లు అర్జున్ కానీ.. దిల్ రాజు కానీ క్లారిటీ ఇస్తే కానీ డౌట్స్ తీరేలా లేవు.
Published by:Kiran Kumar Thanjavur
First published:August 01, 2020, 09:30 IST