Home /News /movies /

ALLU ARAVIND TO RELEASE NAGA CHAITANYA LAAL SINGH CHADDHA MOVIE IN TELUGU SB

Naga Chaitanya: నాగచైతన్య సినిమాను భారీ ధరకు కొన్న అల్లు అరవింద్..!

Photo Twitter

Photo Twitter

ఈ సినిమాను అల్లు అరవింద్ లాంటి బడా నిర్మాత రంగంలోకి దిగి ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడంతో అంచనాలు పెరుగుతున్నాయి.

    టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. చైతు నటించిన థాంక్యూ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు చైతు... బాలీవుడ్‌లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంతో చైతు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య ఈ చిత్రంలో చిన్న పాత్రలోనే నటిస్తున్నప్పటికీ కథకి ఇది చాలా కీలకమైన పాత్ర అని సమాచారం. అమీర్ ఖాన్ తో కలసి చైతు ఈ చిత్రంలో ఆర్మీ జవాన్‌గా మనకు కనిపిస్తాడు. ఈ మూవీలో వీరిద్దరూ స్నేహితులు.

    లాల్ సింగ్ చద్దా సినిమాను ఆగష్టు 11న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ట్రైలర్ కూడానా విడుదల చేశారు. అయితే ఇంతవరకు ఈ మూవీపై ఆశించిన బజ్ ఏర్పడలేదు. సినిమా రిలీజ్ అయ్యాక అమీర్ ఖాన్ నటనే ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో నాగచైతన్య, అమీర్ ఖాన్ నటిస్తోన్న ఈ సినిమాకు తెలుగు మాత్రం పెద్ద డీల్ కుదిరినట్లు సమాచారం. లాల్ సింగ్ చద్దా తెలుగు రిలీజ్ హక్కులని అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. భారీ ధర వెచ్చించి ఆయన ఈ చిత్ర తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రలో రిలీజ్ చేయనున్నారు.



    ఏకంగా అల్లు అరవింద్ లాంటి బడా నిర్మాత రంగంలోకి దిగి ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడంతో అంచనాలు పెరుగుతున్నాయి. లాల్ సింగ్ చద్దాలో ఫ్యాన్స్ ని అలరించే మ్యాటర్ తప్పకుండా ఉండే ఉంటుంది అని అంటున్నారు. గతంలో అల్లు అరవింద్.. అమీర్ ఖాన్ తో గజినీ చిత్రాన్ని నిర్మించారు. ఆ మూవీ అమీర్ ఖాన్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. బాలీవుడ్ లో ఆ చిత్రం తిరుగులేని లాభాలు తెచ్చిపెట్టింది. బహుశా ఆ అనుబంధం వాళ్ళ కూడా అల్లు అరవింద్ లాల్ సింగ్ చద్దా చిత్రంపై ఆసక్తి చూపించ వచ్చని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కరీనా కపూర్ ఫీమేల్ లీడ్ గా నటించింది.

    లాల్ సింగ్ చద్దా సినిమాలో చైతూది కూడా ఆర్మీ మ్యాన్‌ పాత్ర. అందుకే ప్రత్యేకంగా ట్రైనర్‌ని పెట్టుకుని, మేకోవర్‌ అయ్యారని తెలిసింది. కొన్నిరోజుల క్రితమే లడఖ్‌లో ఆరంభమైన ఈ సినిమా సెట్స్‌లోకి ఆమిర్‌ ఖాన్, నాగచైతన్య తదితరులు ఎంటరయ్యారు. కొన్ని టాకీ సీన్స్‌తో పాటు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఈ సీన్స్‌ని హాలీ వుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ డిజైన్‌ చేస్తున్నారట. దాదాపు 20 రోజులు ఈ చిత్రీకరణలో పాల్గొంటారట నాగచైతన్య.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Aamir Khan, Allu aravind, Laal Singh Chaddha, Naga Chaitanya, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు