తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు అడల్ట్ సినిమాల జోరు పెరిగిపోయింది. బోల్డ్ నెస్ పేరుతో ఇష్టమొచ్చినట్లు తీస్తున్నారంటూ ఇప్పటికే విమర్శలు కూడా మొదలయ్యాయి. అయినా కూడా మన దర్శక నిర్మాతల చూపు అటు వైపు పడుతుంది. దానికి తోడు వెబ్ సిరీస్‌లు కూడా అలాగే వస్తున్నాయి. హాట్ వెబ్ సిరీస్‌లు తెలుగులో తక్కువే కానీ హిందీలో మాత్రం చాలానే వస్తున్నాయి. అక్కడ ఆల్ట్ బాలాజీ, ఉల్లు లాంటి సంస్థలు ఏడాదికి నాలుగైదు వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు తెలుగులో కూడా వెబ్ సిరీస్ నిర్మాణం వైపు అడుగులేస్తున్నారు నిర్మాతలు. అందులో అల్లు అరవింద్ కూడా ముందున్నాడని తెలుస్తుంది.
ఈయన ఏకంగా ఓ అడల్ట్ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడని.. అందులో బుజ్జిగాడు ఫేమ్ సంజన హీరోయిన్‌గా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యే వచ్చిన దండుపాళ్యం సినిమాలో ఏకంగా న్యూడ్ సీన్స్ కూడా చేసింది సంజన. దానికి ముందే మర్డర్ కన్నడ రీమేక్‌లో పదేళ్ల కిందే సంచలనాలు రేపింది. ఇక ఆ తర్వాత ఎఫైర్స్‌తో కూడా ఈమె ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూనే వస్తుంది. ఇక ఇప్పుడు ఏకంగా హాట్ వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో స్వర్ణఖడ్గం అనే సీరియల్‌లో కూడా హాట్ పాత్రలో నటించింది సంజన.
అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థలోనే ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారని.. ఇది కూడా పూర్తిగా అడల్ట్ జోకులతో పాటు సెటైర్లు కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇందులో ప్రముఖ యూ ట్యూబ్ కమెడియన్ వైవా హర్ష ప్రధాన పాత్రలో నటించబోతున్నాడు. సంజన పాత్ర చాలా బోల్డుగా ఉంటుందని తెలుస్తుంది. మొత్తం అడల్ట్ కంటెంట్.. జోక్స్‌తో నిండి ఉండబోతుందని.. కొత్త దర్శకుడు ఈ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతన్నాడని తెలుస్తుంది. ఏదేమైనా అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాత నుంచి ఇలాంటి హాట్ వెబ్ సిరీస్ నిర్మిస్తే మాత్రం తెలుగులో పెద్ద సంచలనంగా మారడం ఖాయం. మరి చూడాలిక.. ఇదెలా ఉండబోతుందో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu aravind, Telugu Cinema, Tollywood, Web Series