Allu Arjun Samantha: అవును.. నిజంగానే ఇప్పుడు తన కొడుకు పరువు తానే తీసేసాడు మెగా నిర్మాత అల్లు అరవింద్. అయితే అదంతా మరీ సీరియస్‌గా కాదులెండీ.. కామెడీగానే చిన్నపుడు బన్నీ చేసిన అల్లరి పనుల గురించి చెప్పాడు ఈ మెగా ప్రొడ్యూసర్.
అవును.. నిజంగానే ఇప్పుడు తన కొడుకు పరువు తానే తీసేసాడు మెగా నిర్మాత అల్లు అరవింద్. అయితే అదంతా మరీ సీరియస్‌గా కాదులెండీ.. కామెడీగానే చిన్నపుడు బన్నీ చేసిన అల్లరి పనుల గురించి చెప్పాడు ఈ మెగా ప్రొడ్యూసర్. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చేసిన అల్లరి పనులు అన్నీ బయటికి వచ్చేసాయి. ఇదంతా స్యామ్ జామ్ షోలో జరిగింది. ఈ షోకు వచ్చిన గెస్టులను అదిరిపోయే ప్రశ్నలు అడుగుతుంది సమంత. తొలిసారి హోస్ట్ చేస్తున్నా కూడా ఎవరికీ తెలియని విషయాలు బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది స్యామ్. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ను కూడా ఆసక్తికరమైన ప్రశ్నలే అడిగింది. అందులో మరీ ముఖ్యంగా బన్నీ చిన్నతనం గురించి అడిగింది ఈ భామ. సమంత అడిగిన ప్రశ్నలకు బన్నీక ూడా అంతే ఆసక్తికరంగా సమాధానాలు చెప్పాడు. దానికితోడు అల్లు అరవింద్ కూడా ఈ షోకు రావడంతో బన్నీ గురించి మరికొన్ని తెలియని విషయాలు కూడా బయటికి వచ్చాయి. ఇప్పుడైతే అల్లు అర్జున్ డిసిప్లైన్, వెరీ ఫోకస్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్.. మరి చిన్నప్పుడు ఎలా ఉండేవాడు.. బాగా అల్లరి చేసేవాడా.. కామ్‌గా ఉండేవాడా అంటూ సమంత అడిగింది. దానికి అల్లు అరవింద్ కొడుకును చూసి దండం పెట్టాడు.
అల్లు అర్జున్ సమంత (Allu Arjun Samantha)
ఆ తర్వాత కొడుకు గురించి చాలా విషయాలు చెప్పాడు ఈయన. ఇప్పుడంటే బన్నీ ఇలా ఉన్నాడు కానీ చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు అని చెప్పాడు అల్లు అరవింద్. బన్నీ 11వ తరగతి చదువుతున్నపుడు కాలేజీ ప్రిన్సిపల్ రమ్మన్నారని తనను కాలేజీకి పిలుచుకుని వెళ్లాడని చెప్పాడు అరవింద్. అప్పుడు బన్నీ మార్క్ లిస్ట్ ఇచ్చాడని.. అందులో అన్ని 20, 25 మార్కులే ఉన్నాయని చెప్పాడు. ఆ మార్కులు చూసి ఇక నా పని అయిపోయింది అనుకున్నా. ప్రిన్సిపల్‌తో దొబ్బులు పడతాయి అనుకున్నానని అల్లు అరవింద్ గుర్తు చేసుకున్నాడు. కానీ వెళ్లిన వెంటనే మీరు వెళ్లొచ్చని ప్రిన్సిపాల్ చెప్పడంతో షాక్ అయ్యానని.. ఏంటని అడగటానికి ప్రయత్నిస్తే అప్పుడు బన్నీ చేసిన పని తెలిసిందని చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్.
అల్లు అర్జున్ (Allu Arjun)
వాళ్ల ఫ్రెండ్స్ వచ్చి చెప్తే అసలు విషయం తెలిసిందని చెప్పాడు ఈ నిర్మాత. తనను పిలిచిన ముందు రోజు బన్నీ ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి నీకో కూతురుంది.. నేను ఆమెను ప్రేమించొచ్చు.. ఒకవేళ ప్రేమించాక ఏమైనా జరగొచ్చు అంటూ చిన్న వార్నింగ్ ఇచ్చాడని.. దాంతో భయపడి ప్రిన్సిపాల్ సైలెంట్ అయిపోయాడని చెప్పాడు. అలా చిన్నపుడు చాలానే చేసాడంటూ బన్నీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు అల్లు అరవింద్. అయితే ఈ మాటలతో బన్నీ పరువు మొత్తం పోయింది. విషయం తెలుసుకుని సమంత కూడా పడిపడి నవ్వేసింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.