Home /News /movies /

ALLU ARAVIND SENSATIONAL COMMENTS ON MOVIE TICKETS AND MAHESH BABU DANCE ON STAGE SB

Mahesh Babu:అందుకే స్టేజ్‌పై మహేష్ బాబు డాన్స్ వేసే పరిస్థితి.. అల్లు అరవింద్ హాట్ కామెంట్స్

అల్లు అరవింద్, మహేష్ బాబు

అల్లు అరవింద్, మహేష్ బాబు

సర్కారు వారి పాట సినిమా సక్సెస్ మీట్‌ కర్నూలులో జరిగిన విషయం తెలిసిందే. అక్కడ ఎప్పుడూ లేని విధంగా మహేష్ బాబు స్టేజ్ పై డాన్స్ వేసి అలరించారు. తాజాగా ఓ పెద్ద హీరో స్టేజ్ పై డాన్స్ వేశాడంటూ.. అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సినిమా ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సినిమాల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది.కరోనా వైరస్ (Coronavirus) ఎఫక్ట్‌తో రెండేళ్ల పాటు.. జనం చాలావరకు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంటినుంచి పని మొదలు పెట్టారు. దీంతో జనం ఇంటికే ఎంటర్ టైన్ మెంట్ చేరాలంటూ.. ఓటీటీ (Ott) ఊపందుకుంది. అందరూ ఓటీటీ వేదికగా వెబ్ సిరీస్, సినిమాలు విడుదల చేయడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు అదే సినీ పరిశ్రమకు పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది, పరిస్థితి చక్కబడినా.. జనం థియేటర్లకు వచ్చేందుకు ఇంట్రస్ట్ చూపించడం లేదు. కొత్త సినిమా విడుదలైనా.. థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి కనబరచడం లేదు. రెండు మూడు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఇంట్లోనే సినిమా చూసేద్దామన్న ఆలోచనలో పడ్డారు ఆడియన్స్. ఈక్రమంలో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.

    ‘సర్కారు వారి పాట’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో స్టేజ్ పై తమన్‌తో మహేష్ బాబు చిందులు (Twitter/Photo)


    సినిమాలు థియేటర్లలోనే చూడాలని సూచించారు నిర్మాత అల్లు అరవింద్. "టికెట్ రేట్లు తగ్గించాలి, ఓటీటీని కాస్త దూరం పెట్టాలి" అంటూ సింపుల్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు అరవింద్. ఇండస్ట్రీ ఇప్పుడు నేర్చుకున్న పాఠం ఏమిటంటే.. టికెట్ రేట్లు తగ్గించాలి, ఓటిటిలలో ఆలస్యంగా సినిమా వేయాలని తెలిపారు. ఈ మధ్య ఆడియన్స్ థియేటర్స్ కు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు..సినిమా ప్రమోషన్స్ కోసం హిరోలు కూడా రావాలన్నారు. ఈ మధ్య స్టేజ్ మీద ఓ పెద్ద హిరో డాన్స్ కూడా చేశాడని అన్నారు. ఆడియన్స్ థియేటర్స్ కు రప్పించడానికి హీరో, హీరోయిన్స్ ప్రమోషన్ చేసుకోవాలని చెప్పారు నిర్మాత అల్లు అరవింద్. ఇక ఇటీవలే సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా సక్సెస్ మీట్‌ కార్యక్రమం కర్నూలు(Kurnool)లో జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేజ్ పై మహేష్ బాబు (Mahesh Babu) తొలిసారిగా డాన్స్ వేసి తన ఫ్యాన్స్ ‌ను అలరించారు.

    కేజీఎఫ్ (KGF), ఆర్ఆర్ఆర్(RRR) వంటి సినిమాలకు టికెట్ రేట్లు పెంచేశారు. అది నిర్మాతలకు వర్క్ అవుట్ అయ్యింది. కానీ అదే ప్లాన్ ఆచార్య విషయంలో బెడిసి కొట్టింది. మెగాస్టార్ సినిమాతో పూర్తిగా క్లారిటీ వచ్చింది. దీంతో మొదటికే మోసం వచ్చిందని గ్రహించి టికెట్ రేట్లు మళ్లీ తగ్గించడం మొదలు పెట్టారు. ఎఫ్3 (F3) సినిమాకు సాధారణ టికెట్ రేట్లు ఉంచారు. ప్రత్యేకంగా పెంచలేదు. ఇక మేజర్ సినిమాకైతే ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే తక్కువ ధరలకే టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు. మరోవైపు ఓటీటీ కూడా స్పీడ్ అందుకుంది. విడుదలైన వారం రోజులకే ఓటీటీ(OTT)లో స్ట్రీమింగ్ కు ఇచ్చేయడం లాంటివి జరిగాయి. మొన్నటివరకు చిన్న సినిమాలే ఇలా చేస్తున్నాయనుకుంటే, రీసెంట్ గా రాధేశ్యామ్, ఆచార్య లాంటి పెద్ద సినిమాలు కూడా చాలా తొందరగా ఓటీటీలోకి రావడం మొదలైంది. దీంతో ప్రేక్షకులు థియేట్లకు దూరం అయ్యారు. తాజాగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలతో ప్రతి సినిమాకు టికెట్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అదే టైమ్ లో ఓటీటీ స్ట్రీమింగ్ కు కూడా కాస్త దూరంగా జరిగే పరిస్థితులు ఏర్పడతాయని టాలీవుడ్‌(Tollywood) లో జోరుగా చర్చ జరుగుతోంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Aha OTT Platform, Allu aravind, Allu Arjun, Film tickets, Mahesh Babu, Ott platform

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు