రీసెంట్ గా విడుదలైన 18 పేజెస్ (18 Pages) మూవీ సక్సెస్ సాధించడంతో చిత్రయూనిట్ అంతా కూడా ఎంజాయ్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ ప్రేక్షకుల మన్ననలు పొందుతుండటంతో చిత్రబృందం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంతా కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో (Anupama Parameswaran) కలిసి నిర్మాత అల్లు అరవింద్ డాన్స్ (Allu Aravind Dance) చేస్తుండటం చూసి అంతా ఫిదా అవుతున్నారు.
18 పేజీస్ మూవీ విజయంతో ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన బన్నీ వాసు, అల్లు అరవింద్, సుకుమార్ తమ ఆనందాన్ని చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పంచుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్ లో అల్లు అరవింద్ హీరోయిన్ అనుపమతో కలిసి స్టెప్పేశారు. అంతలోనే సుకుమార్ కూడా డ్యాన్స్ ఫ్లోర్ పైకి రావడంతో ముగ్గురూ కలిసి చిందేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిన 18 పేజీస్ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ కలసి నిర్మించాయి. సుకుమార్ శిష్యుడైన పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ చిత్రంలో నిఖిల్ సిద్దార్థ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించారు. వెండితెరపై ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందట.
Look who are Happy And Dancing ????❤️ #18Pages Producers #AlluAravind sir and @aryasukku ???????? @anupamahere Thanks to the Audience for Showering Love on this Cute Warm Film ???????? #AboutLastNight #18PagesSuccessParty @GeethaArts @SukumarWritings pic.twitter.com/by2CuXoxS9
— Nikhil Siddhartha (@actor_Nikhil) December 25, 2022
ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్, అనుపమ వరుసగా రెండోసారి జోడీ కట్టారు. కార్తికేయ-2లో కలిసి నటించిన మేమిద్దరం మరోసారి ఈ 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్నామని ముందే చెప్పిన నిఖిల్.. అదే చేసి నిరూపించారు. దీంతో ఇటు నిఖిల్, అటు అనుపమ కెరీర్ లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ అయింది. గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రంతో హిట్ అందుకున్న డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు.
సుకుమార్ రైటింగ్స్ నుంచి రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. కాగా, ఈ 18 పేజెస్ మూవీని సంక్రాంతి కానుకగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక అయిన ఆహా ఈ సినిమా హక్కులను తీసుకుందని, జనవరి నెల రెండో వారంలో ఈ సినిమాను డిజిటల్ మాధ్యమాల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 18 pages movie, Allu aravind, Anupama parameshwaran, Director sukumar