Home /News /movies /

ALLU ARAVIND AHA VIDEO BAGS VAISSHNAV TEJ KETIKA SHARMA RANGA RANGA VAIBHAVANGA MOVIE OTT RIGHTS HERE ARE THE DETAILS SR

Vaisshnav Tej | Aha : ఆహాలో వైష్ణవ్ తేజ్ కొత్త మూవీ రంగరంగ వైభవంగా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Vaisshnav Tej - Ketika Sharma Ranga Ranga Vaibhavanga  Photo : Twittter

Vaisshnav Tej - Ketika Sharma Ranga Ranga Vaibhavanga Photo : Twittter

Vaisshnav Tej : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్.

ఇంకా చదవండి ...
    మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్. ఉప్పెన తర్వాత ఆయన నటించిన సినిమా కొండపొలం (Kondapolam). ఈ చిత్రం 2021 అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో (Kondapolam on Amazon Prime) స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే వైష్ణవ్ మూడో సినిమా రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga ).. ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. ఈ (Ranga Ranga Vaibhavanga ).. సినిమా అప్పుడే షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో త్వరలో విడుదల తేదీని ప్రకటించనుంది టీమ్. కాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను (Aha )ఆహా స్ట్రీమింగ్ సంస్థ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఇవి పోస్ట్-థియేట్రికల్ OTT హక్కులని గమనించగలరు. సినిమా థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ కానుంది.

    ఇక ఆ మధ్య ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేసింది టీమ్. తెలుసా తెలుసా అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాయగా.. శంకర్ మహాదేవన్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ (Ranga Ranga Vaibhavanga ).. సినిమాకుగీరిషయ్య దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా రొమాంటిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ (Ketika sharma) కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్‌తో రొమాన్స్ చేయబోతుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుంది. మొదటి రెండు సినిమాలతో పోలిస్తే.. రంగరంగ వైభవంగా కోసం మరింత స్టైలిష్‌గా మారిపోయారు వైష్ణవ్.

    The Kashmir Files : క్రిటిక్స్, ప్రేక్షకులు ప్రశంసలు దక్కించుకుంటున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ..

    ఇక వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ సినిమా కొండపొలం విషయానికి వస్తే.. ర‌వీంద్ర‌నాథ్ గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన వ్యక్తి. బిటెక్ చేసిన రవి ఉద్యోగం కోసం హైద‌రాబాద్ వస్తాడు. ఎంత ప్ర‌య‌త్నించినా రవి ఉద్యోగం రాదు. దీంతో తన సొంత ఊరికి చేరుతాడు. ఇక తన తండ్రితో పాటు గొర్రెల్ని మేప‌డం కోసం కొండ‌పొలానికి వెళ‌్లడం అక్కడ ఏం జరిగింది. రకుల్ పాత్ర ఏమిటీ. రవి ఐ.ఎఫ్‌.ఎస్‌ ఎలా ఎంపిక అయ్యాడు అనేవి కథలో ముఖ్యాంశాలు. ఈ సినిమాలో (Rakul Preet Singh) రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్‌గా ఓబులమ్మ అనే పాత్రను చేసారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Aha OTT Platform, Ketika sharma, Tollywood news, Vaishnav tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు