Home /News /movies /

ALLARI SUBHASHINI REVEALS ABOUT HER HEALTH PROBLEM CANCER IN EXTRA JABARDASTH SHOW NR

Allari Subhashini: చచ్చి బతికానంటూ జబర్దస్త్‌లో అల్లరి సుభాషిణి కన్నీరుమున్నీరు.. తన రోగం గురించి చెప్తూ?

Allari Subhashini: తెలుగు సినీ నటి అల్లరి సుభాషిణి. తెలుగులో పలు సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలువలేకపోయింది.

Allari Subhashini: తెలుగు సినీ నటి అల్లరి సుభాషిణి. తెలుగులో పలు సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలువలేకపోయింది.

Allari Subhashini: తెలుగు సినీ నటి అల్లరి సుభాషిణి. తెలుగులో పలు సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలువలేకపోయింది.

    Allari Subhashini: తెలుగు సినీ నటి అల్లరి సుభాషిణి. తెలుగులో పలు సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలువలేకపోయింది. ఈమె అసలు పేరు తిరుమల సుభాషిణి కాగా ఈమె నటించిన అల్లరి సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో అల్లరి సుభాషిణిగా పేరు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత శ్రీ ఆంజనేయం, కితకితలు, సుడిగాడు వంటి పలు సినిమాలలో సహాయ పాత్రల్లో నటించింది. ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ షోలో బాగా ఎమోషనల్ అయింది.                                                                                                                                                                                                                                                                              ప్రతి వారం బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఎంతో మంది కమెడియన్స్ తమ పర్ఫామెన్స్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇందులో ప్రతి వారం ఎవరినైనా సెలబ్రేటీలను గెస్ట్ లుగా ఆహ్వానిస్తారు. ఇదిలా ఉంటే ఈ వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది.                                                                                                                                                                                                                                                         అందులో కమెడియన్స్ తమ పర్ఫామెన్స్ లతో బాగా సందడి చేశారు. ఎంట్రీలో పిల్లలతో బాగా సందడి చేశాడు సుధీర్. గెటప్ శీను తన కామెడీ పంచ్ లతో తెగ నవ్వించాడు. ఇక ఇందులో చివర్లో అల్లరి సుభాషిణి ఓ స్కిట్ లో పాల్గొని డాన్స్ స్టెప్పులను చేసింది. స్కిట్ అనంతరం రోజా అల్లరి సుభాషిణితో మాట్లాడుతూ..

    https://youtu.be/Zvo3giNSo1A

    ఎన్నో రోజులకు మీరు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉందమ్మా అని అన్నది. వెంటనే సుభాషిణి ఓ విషయం చెప్పనా రోజా అంటూ.. నేను మళ్లీ చచ్చిపోయి బ్రతికాను అని అనేసరికి అక్కడ కాస్త ఎమోషనల్ గా అనిపించింది. వెంటనే రోజా ఏమైంది అని అడిగేసరికి క్యాన్సర్ వచ్చింది అంటూ బాగా ఎమోషనల్ అయ్యింది. ఇక తనను పక్కనున్న లేడీ కమెడియన్ ఓదారుస్తూ కనిపించింది. ఇక ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారగా ఈ షో శుక్రవారం ఈటీవి లో ప్రసారం కానుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Allari subhashini, Extra jabardasth, Immanuel, MLA Roja, Rashmi, Sudigali sudheer

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు