Home /News /movies /

ALLARI NARESH VARALAXMI SARATHKUMAR VIJAY KANAKAMEDALA SATISH VEGESNA NAANDHI TRAILER LOOKS RELEASED SR

Allari Naresh | Naandhi Trailer : అల్లరి నరేష్‌కు హిట్ గ్యారెంటీ.. అదిరిన నాంది ట్రైలర్..

Allari Naresh Naandhi Trailer Photo : Twitter

Allari Naresh Naandhi Trailer Photo : Twitter

Allari Naresh | Naandhi Trailer : అల్లరి నరేష్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఓవైపు కామెడీని పండేస్తూనే మరోవైపు సీరియస్ పాత్రల్లో నటిస్తూ అదరగొడుతుంటాడు.

    అల్లరి నరేష్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఓవైపు కామెడీని పండేస్తూనే మరోవైపు సీరియస్ పాత్రల్లో నటిస్తూ అదరగొడుతుంటాడు. గమ్యంలో ఆయన ఓ రేంజ్‌లో ఉంటుంది. ప్రాణం సినిమాలో కూడా నరేష్ అదరగొట్టాడు. ఇక ఆయన తాజా సినిమా నాందిలో ఇరగదీశాడు నరేష్. అయితే నరేష్ పరిస్థితి ఈ మధ్య ఏం బాగాలేదు. ఆయన నటించిన సినిమాలు పెద్దగా అలరించలేకపోతున్నాయి. ఆ మధ్య మహేష్ మ‌హ‌ర్షి చిత్రంలో అల్లరి న‌రేష్ న‌ట‌న చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో అల్లరి న‌రేష్ త‌న న‌ట‌న‌తో విమ‌ర్శకుల ప్రశంస‌లు అందుకున్నాడు. ఇక కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న అల్లరి న‌రేష్ నాంది చిత్రంతో ఎలా అయినా హిట్ కొట్టాల‌ని అనుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పాలి. ట్రైలర్ ‌లో పేలిపోయి సీన్స్ చాలా ఉన్నాయి. చాలా ఇంటెన్స్‌గా ఉంది ట్రైలర్. నరేష్ కూడా అదరగొట్టాడు. ఆయన కొన్ని సీన్స్‌లో న్యూడ్ కనిపించాడు. చేయని హత్య వల్ల శిక్ష అనుభవిస్తోన్న నరేష్ ఎలా ఆ కేసు నుంచి బయటపడ్డాడు. దానికి కారణం ఎవరు అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాను స‌తీశ్ వేగేశ్న నిర్మిస్తున్నాడు.

    ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ లాయ‌ర్ గా క‌నిపించ‌నుంది. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ సినిమాను ఫిబ్రవ‌రి 19న విడుద‌ల కానుంది.


    ఇక ఈ ‘నాంది’ ట్రైలర్‌ను మహేష్ ఈరోజు ఉదయం 10:08 గంటలకు విడుదల చేశాడు. ట్రైలర్ చాలా ఇంటెన్స్‌గా ఉందని నరేష్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు మహేష్. ఇక మహేష్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు.. తన సర్కారు వారి పాట షూటింగ్‌లో పాల్గోంటున్నాడు. ఈ సినిమాకు పరుశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. నరేష్ నాంది ట్రైలర్‌ను మహేష్ అక్కడ నుండే విడుదల చేయనున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Allari naresh, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు