బాలకృష్ణ టైటిలే కాదు.. పాటను కూడా వాడేసుకుంటున్న అల్లరి నరేష్..

ప్రస్తుతం అల్లరి నరేష్ బంగారు బుల్లోడు’ టైటిల్‌తో ఒక సినిమా చేస్తున్నాడు. బాలయ్య నటించిన పాత సూపర్ హిట్ టైటిల్ ను యూజ్ చేసుకోవడమే కాకుండా...ఈ సినిమాలో సూపర్ హిట్టైయిన స్వాతిలో ముత్యమంత పాటను కూడా రీమేక్ చేస్తున్నారు.

news18-telugu
Updated: July 1, 2019, 12:30 PM IST
బాలకృష్ణ టైటిలే కాదు.. పాటను కూడా వాడేసుకుంటున్న అల్లరి నరేష్..
బాలయ్య ‘బంగారు బుల్లోడు’ టైటిల్‌తో వస్తోన్న అల్లరి నరేష్
  • Share this:
నిన్న మొన్నటి వరకు రాజేంద్రప్రసాద్ తర్వాత తెలుగులో మినిమం గ్యారంటీ హీరోగా అల్లరి నరేశ్‌కు మంచి పేరుండేది. కానీ ‘సుడిగాడు’ తర్వాత మనోడి సుడి ఏమాత్రం బాగాలేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. జనాలకు కూడా అల్లరి నరేష్ కామెడీపై రాను రాను ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అల్లరినరేష్ హీరో వేషాలకే పరిమితం కాకుండా...మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘మహర్షి’లో  ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి మంచి మార్కలే కొట్టేసాడు. అంతేకాదు ఇపుడు పి.వి.గిరి దర్శకత్వంలో ఒక సినిమాకు కమిటైయ్యాడు. ఈ సినిమాకు ఒకప్పటి బాలకృష్ణ సూపర్ హిట్ టైటిల్ ‘బంగారు బుల్లోడు’ టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. హీరోగా అల్లరి నరేష్‌కు ఇది 55వ సినిమా ఇది. మెడలో బంగారంతో ఉన్న అల్లరి నరేష్ లుక్ అట్రాక్టివ్‌గా ఉంది. పూజా ఝవేరి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈసినిమాను ఏ.కే.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కనుంది.

Allari Naresh used balakrishna's Movie Title Bangaru Bullodu in his next movie and also remix swathi lo muthyamantha song,allari bullodu,allari naresh,nandamuri balakrishna,balayya,nbk,balakrishna allari naresh,balayya allari naresh,balakrishna allari naresh bangaru bullodu,#allarinaresh,#HBDAllariNaresh,Allari Naresh Happy birth Day,bangaru bulludu,allari naresh bangaru bullodu,allari naresh,allari naresh movies,allari naresh comedy movies,allari naresh comedy,allari naresh wife,allari naresh real life,allari naresh daughter,allari naresh wife pics,allari naresh interview,allari naresh wife photo,allari naresh wife photos,allari naresh and his wife,allari naresh comedy scenes,allari naresh family photos,hero allari naresh daughter,allari naresh daughter pics,Tollywood comedy king allari naresh,tollywood,telugu cinema,అల్లరి నరేష్,అల్లరి నరేష్ బర్త్ డే,బంగారు బుల్లోడు,టాలీవుడ్ కామెడీ కేరాఫ్ అడ్రస్ అల్లరి నరేష్,అల్లరి నరేష్ కామెడీ,బాలకృష్ణ,అల్లరి నరేష్,బాలకృష్ణ అల్లరి నరేష్,బాలయ్య అల్లరి నరేష్,బాలకృష్ణ అల్లరి నరేష్ బంగారు బుల్లోడు,బాలయ్య రీమిక్స్ సాంగ్,
బంగారు బుల్లోడు టైటిల్‌తో వస్తోన్న అల్లరి నరేష్


ఐతే.. అల్లరి నరేష్.. ఈ సినిమాకు బాలకృష్ణ ఒకప్పటి సూపర్ హిట్ సినిమా ‘బంగారు బుల్లోడు’ టైటిల్ వాడుకోవడమే కాదు.. ఈ సినిమాలో సూపర్ హిట్టైయిన స్వాతిలో ముత్యమంత పాటను కూడా ఈ సినిమాలో రీమేక్ చేస్తున్నారు. అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ప్రోమోతో ఈ విషయమై  క్లారిటీ ఇచ్చారు.అప్పట్లో బాలయ్య, రవీనా టాండన్‌లపై చిత్రీకరించిన ఈ పాటను ఇపుడు పూజా ఝవేరితో కలిసి అల్లరి నరేష్ వాన పాటకు చిందేయనున్నాడు. మరి బంగారు బుల్లోడు సూపర్ సక్సెస అయినట్టే..ఈ సినిమాతో అల్లరి నరేష్ హిట్ అందుకుని నిజంగానే బంగారు బుల్లోడు అనిపించుకుంటాడా లేదా అనేదిచూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 1, 2019, 12:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading